కేరళలో కొల్లం జిల్లాలో అడవి జంతువుల్ని వేటాడి వాటి మాంసాన్ని విక్రయిస్తోన్న నలుగురు నిందితుల్ని అటవీశాఖ అధికారులు అరెస్టు చేశారు. అలిముక్కు- కరవూర్ రహదారిలో అటవీశాఖ అధికారులు వాహన తనీఖీలు చేపట్టగా అటవీ జంతువుల మాంసాన్ని ఎగుమతి చేస్తోన్న నిందితులు కరవూర్ గ్రామానికి చెందిన అనిల్ శర్మ, కే షాజీ, జయకుమార్, అన్చల్, ఏరమ్కు చెందిన ప్రదీప్‌లను అరెస్టు చేశారు.
అంతేకాకుండా నిందితులు నిర్వహిస్తోన్న ఫాం హౌస్‌లోనూ తనీఖీలు చేసి తుపాకుల్ని, బుల్లెట్లని, కత్తుల్ని, సాంబర్ జింక తలల్ని, బరువు తూచే యంత్రాన్ని, జంతువుల మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు.
నిందితుల దగ్గర స్వాధీనం చేసుకున్న మాంసాన్ని డీఎన్ఏ పరీక్షకు పంపినట్లు పతానపురం అటవీ శాఖ అధికారి తెలిపారు. కాగా నాలుగు రోజుల క్రితం కదక్కమన్లో ముళ్లపందిని చంపిన కేసుతోనూ ఈ నిందితులకు సంబంధం ఉందని వెల్లడించారు. ఈ కేసును కూడా వారిపై నమోదు చేసినట్లు తెలిపారు. అయితే ఈ కేసులలో పెద్ద పెద్ద వారి హస్తమే ఉందని అన్నారు.
ఇదీ చూడండి: చిన్నారులపై తల్లిదండ్రుల క్రూరత్వం