మహారాష్ట్ర కొల్హాపూర్‌కు చెందిన ఓ ఫ్రీ స్టైల్ ఫుట్‌బాలర్ రెండు సార్లు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లోకెక్కాడు. కేవలం ఐదు నెలల వ్యవధిలోనే ఈ ఘనతను సాధించాడు. ఇంతవరకు ఫుట్‌బాల్‌తో ఈ తరహా రికార్డు సాధించినవారెవరూ లేకపోవడం విశేషం.
ఒక్క నిమిషంలో 81 సార్లు..
ముక్కు, నుదుటిపై ఫుట్‌బాల్ ఆడిస్తూ రెండు సార్లు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించాడు మహారాష్ట్రకు చెందిన ప్రణబ్ భోపాలే. నిమిషం వ్యవధిలో 81 సార్లు ఫుట్‌బాల్‌ను బ్యాలెన్స్ చేశాడు.
మూడేళ్ల నుంచి..
ప్రణబ్ గత మూడేళ్ల నుంచి ఫ్రీ స్టైల్ ఫుట్‌బాల్ సాధన చేస్తున్నాడు. అందులో భిన్నమైన మెళకువలు నేర్చుకుంటున్నాడు. అయితే.. ఫుట్‌బాల్‌తో ఈ తరహా రికార్డు సాధించిన ఏకైక వ్యక్తి ప్రణబ్ కావడం గమనార్హం. ప్రణబ్ తొలుత 2020 ఆగస్టులో ఫ్రీ స్టైల్ ఫుట్‌బాలర్‌గా ఓ రికార్డు నెలకొల్పాడు.
ఈ రికార్డు సాధించేందుకు తాను రోజుకు 8 గంటలు కష్టపడ్డట్లు ప్రణబ్ తెలిపాడు. తల్లితండ్రుల సహకారం వల్లే ఇది సాధ్యమైందని చెప్పాడు.
ఇదీ చదవండి:సౌరశక్తి చుట్టూ దేశం- ఇంధన రంగంలో నవశకం