ETV Bharat / bharat

లిఫ్ట్‌లో మైనర్​పై డెలివరీ బాయ్ లైంగిక వేధింపులు.. అత్యాచారం చేసిన 'ఆమె' స్నేహితుడు! - కేరళలో యువతిపై స్నేహితుడి అత్యాచారం

పదేళ్ల బాలికపై.. ఓ డెలివరీ బాయ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. లిఫ్ట్​లో ఒంటరిగా ఉన్న బాలిక శరీర భాగాలను తాకుతూ అసభ్యకరంగా ప్రవర్తించాడు. బెంగళూరులోని ఓ అపార్ట్​మెంట్​లో ఈ ఘటన జరిగింది. మరోవైపు కేరళలో ఓ యువతిని కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు ఆమె స్నేహితుడు.

food-delivery-boy-sexually-harasses-girl-in-lift-at-bengaluru-karnataka
బాలికపై లిఫ్ట్‌లో డెలివరీ బాయ్ లైంగిక వేధింపులు
author img

By

Published : Jun 26, 2023, 10:46 AM IST

Updated : Jun 26, 2023, 11:00 AM IST

లిఫ్ట్​లో ఒంటరిగా ఉన్న 10 ఏళ్ల బాలికపై.. లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు ఓ డెలివరీ బాయ్​. చిన్నారి శరీరాన్ని తాకుతూ అసభ్యకరంగా ప్రవర్తించాడు. టీచర్ వద్దకు ట్యూషన్​కు​ కోసం వెళుతున్న చిన్నారిను వేధింపులకు గురించేశాడు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ ఘటన జరిగింది. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి.. అతడ్ని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడ్ని చేతన్​(30)గా పోలీసులు గుర్తించారు. జూన్ 21న తలఘట్టపుర్ పోలీస్​ స్టేషన్ పరిధిలోని.. ఓ అపార్ట్​మెంట్​లో ఘటన జరిగింది. ఆ రోజు సాయంత్రం బాధితురాలు 13వ ఫ్లోర్​లో టీచర్​ వద్దకు ట్యూషన్​కు కోసం లిఫ్ట్​లో వెళుతోంది. అదే సమయంలో చేతన్​ కూడా 3వ ఫ్లోర్​లో ఉన్న కస్టమర్​కు.. పుడ్ డెలివరీ చేసేందుకు వెళుతున్నాడు. లిఫ్ట్​లో బాలికను ఒంటరిగా ఉండటాన్ని ఆసరాగా చేసుకున్న చేతన్​.. ఆమెతో అభ్యకరంగా ప్రవర్తించాడు. బాలిక శరీరాన్ని తాకుతూ.. లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అనంతరం లిఫ్ట్​ నుంచి బయటకు వచ్చిన బాలిక.. ఘటనపై ట్యూషన్​ టీచర్​కు ఫిర్యాదు చేసింది.

వెంటనే అప్రమత్తమైన టీచర్​.. డెలివరీ బాయ్​ను పట్టుకోవాల్సిందిగా సెక్యూరిటీ గార్డ్​కు సూచించారు. బాలిక తల్లిదండ్రులకు కూడా సమాచారం అందించింది. పుడ్​ డెలివరీ చేసి వెంటనే తిరుగుముఖం పట్టిన నిందితుడ్ని.. అపార్ట్​మెంట్​ వాసులు, సెక్యూరిటీ గార్డ్ పట్టుకున్నాడు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి వచ్చిన పోలీసులు.. చేతన్​ను అదుపులోకి తీసుకున్నారు. అతడిపై పోక్సో కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు.

యువతి కిడ్నాప్​.. గిడ్డంగిలో రేప్​..
యువతిని కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు ఆమె స్నేహితుడు. శనివారం అర్థరాత్రి బాధితురాలిని ఓ గిడ్డంగికి తీసుకెళ్లి ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఆమెను వివస్త్రను చేసి తీవ్రంగా కొట్టి.. అలాగే విడిచిపెట్టి వెళ్లాడు. అనంతరం స్థానికుల సాయంతో పోలీసులను ఆశ్రయించింది బాధితురాలు. కేరళలోని తిరువనంతపురం జిల్లాలో ఈ ఘటన జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
అట్టింగల్ ప్రాంతానికి చెందిన కిరణ్​ అనే వ్యక్తి ఈ ఘటనకు పాల్పడ్డాడు. నిందితుడితో బాధితురాలికి ఇది వరకే పరిచయం ఉంది. కాగా శనివారం రాత్రి పది గంటలకు బాధితురాలు మరో వ్యక్తితో కలిసి.. కజక్కూట్టం పరిధిలోని టెక్నోపార్క్ సమీపంలో ఉన్న ఓ రెస్టారెంట్​కు వచ్చింది. ఆ విషయం తెలుసుకున్న కిరణ్​.. అక్కడి చేరుకుని బాధితురాలిపై చేయిచేసుకున్నాడు. ఇంటికి తీసుకువెళతానని చెప్పి బలవంతంగా ఆమెను బెక్​పై​ ఎక్కించుకున్నాడు. అనంతరం ఇంటికి కాకుండా 1.30 గంటల ప్రాంతంలో మేనంకులంలోని ఓ గిడ్డంగికి తీసుకెళ్లాడు. అక్కడ మరోసారి ఆమెను దారుణంగా కొట్టి.. అత్యాచారానికి పాల్పడ్డాడు.

friend kidnaped young women and raped in kerala
నిందితుడు కిరణ్​

ఆదివారం ఉదయం 5 గంటలకు వరకు బాధితురాలను.. కిరణ్​ చిత్రహింసలకు గురిచేశాడని పోలీసులు తెలిపారు. ఆమెను వివస్త్రను చేసి.. ఘటన మొత్తాన్ని ఫోన్​లో వీడియో కూడా తీశాడని పేర్కొన్నారు. అనంతరం ఆమెను అలాగే వదిలేసి వెళ్లాడని.. స్థానికుల సాయంలో బాధితురాలు పోలీసులను ఆశ్రయించిందని వారు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం కోర్టులో హాజరు పరిచినట్లు వెల్లడించారు. బాధితురాలు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని వారు పేర్కొన్నారు.

Last Updated : Jun 26, 2023, 11:00 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.