ETV Bharat / bharat

Flipkart Big Billion Days Sale 2023 : ఫ్లిప్​కార్ట్​ షాపింగ్.. ఈ క్రెడిట్ కార్డులు ఉన్నవారికి పండగే..! - ఫ్లిప్​కార్ట్ సేల్​లో బ్యాంకుల ప్రత్యేక ఆఫర్లు

Flipkart Big Billion Days Sale 2023 Offers : దసరా సీజన్ మొదలైంది.. ఆన్​లైన్​ షాపింగ్ సంస్థలు ఆఫర్లు ప్రకటించాయి. ఫ్లిప్​కార్ట్.. బిగ్ బిలియన్ డేస్ 2023ని అనౌన్స్ చేసింది. అయితే.. క్రెడిట్ కార్డుల ద్వారా జరిపే ఫ్లిప్​కార్ట్​ లావాదేవీలపై కొన్ని బ్యాంకులు డిస్కౌంట్స్ అందిస్తున్నాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

Flipkart Big Billion Days Sale
Flipkart Big Billion Days Sale 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 12, 2023, 2:17 PM IST

Flipkart Big Billion Days Sale 2023 Latest Update : దేశంలో వరుస పండగల సీజన్ నేపథ్యంలో ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్​ఫామ్స్ అమెజాన్, ఫ్లిప్​కార్ట్​లు ప్రతీ ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా ప్రత్యేక సేల్స్ ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో స్మార్ట్ ఫోన్ ప్రియులను, కంప్యూటర్లు, లాప్‌టాప్‌లు, ట్యాబ్స్, స్మార్ట్ వాచ్​లు(Smart Watches)​ కొనుగోలు చేసే విద్యార్థులను, ఎలక్ట్రానిక్ గృహోప‌క‌ర‌ణాలు కొనుగోలు చేసే వారిని ఆకట్టుకోవడానికి ఆయా వస్తువులపై ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించాయి.

Flipkart Big Billion Days Sale 2023 : అయితే.. ఫ్లిప్ కార్ట్ అదనంగా వినియోగదారులను తమ వైపు తిప్పుకోవడానికి.. క్రెడిట్ కార్డులపై ప్రత్యేక డిస్కౌంట్స్​ ప్రకటించింది. అలాగే పేటీఎం, ఇతర యూపీఐ వాలెట్ బేస్డ్ ఆఫర్లనూ అందిస్తోంది. అదేవిధంగా.. ఈఎంఐ ఆప్షన్లు ఎంచుకున్నా వాటిపై కూడా అదిరిపోయే ఇన్​స్టంట్ డిస్కౌంట్లు (ఫ్లిప్​కార్ట్ బిగ్ బిలియన్ డేస్​ సేల్ 2023(Flipkart Big Billion Days Sale)​ అందుబాటులో ఉన్నాయి. ఇంతకీ ఏయే బ్యాంకుల క్రెడిట్ కార్డులపై ఎంత మేర డిస్కౌంట్స్ ఉన్నాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Banks Offering Special Discounts on Flipkart Big Billion Days Sale 2023 : ఫ్లిప్​కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2023 అక్టోబర్ 8వ తేదీన ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇంతకుముందులాగే ఫ్లిప్​కార్ట్ ప్లస్ సభ్యత్వం ఉన్న వారికి 24 గంటల ముందే ఈ సేల్​లోని ఆఫర్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ సేల్​ అక్టోబర్ 15 వరకు కొనసాగనుంది. అంటే ఇక మూడు రోజులే ఈ ప్రత్యేక సేల్ ఉండనుంది. కాబట్టి వినియోగదారులు ఇప్పుడే ఈ సేల్​లో వివిధ బ్యాంకుల క్రెడిట్ కార్డులు(Credit Cards) అందిస్తున్న స్పెషల్ డిస్కౌంట్స్​ని వినియోగించుకుని.. కొనుగోలు చేసే వస్తువుపై భారీ తగ్గింపుని పొందొచ్చని సంస్థ ప్రకటించింది.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్‌లో ప్రత్యేక తగ్గింపును అందిస్తున్న బ్యాంకులివే..

యాక్సిస్ బ్యాంక్ : కార్డ్ ఇన్‌సైడర్ నుంచి వచ్చిన నివేదిక ప్రకారం.. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్‌లు బిగ్ బిలియన్ సేల్ సమయంలో ఫ్లిప్‌కార్ట్‌లో షాపింగ్ చేసేటప్పుడు అనేక ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ వినియోగదారులు కార్డు ద్వారా రూ. 5,000 కంటే ఎక్కువ జరిపే లావాదేవీలు, క్రెడిట్ EMI లావాదేవీలపై 10% తక్షణ తగ్గింపును పొందవచ్చు. గరిష్ఠంగా ఈ తగ్గింపు రూ.1,250 వరకు లభిస్తుంది. అలాగే.. ఈ కార్డు వినియోగదారులు అదనంగా, రూ.24,990 కంటే ఎక్కువ నెట్ కార్ట్ విలువ కలిగిన ఆర్డర్‌లపై ఫ్లాట్ రూ.750 డిస్కౌంట్ అందిస్తారు. రూ. 79,990 కంటే ఎక్కువ నికర కార్ట్ విలువ కలిగిన ఆర్డర్‌లపై ఫ్లాట్ రూ.3,000 తగ్గింపును పొందవచ్చు. అయితే.. ఈ ఆఫర్లు యాక్సిస్ బ్యాంక్ కార్పొరేట్, కమర్షియల్ కార్డ్‌లకు వర్తించవనే మీరు గమనించాలి.

Festival Offers In October 2023 : దసరా పండుగ సేల్స్​​.. ఫ్యాషన్​ & బ్యూటీ ప్రొడక్టులపై 90%.. స్మార్ట్​ఫోన్లపై 80% డిస్కౌంట్స్​!

ICICI బ్యాంక్ : ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్‌లు ఆకర్షణీయమైన తగ్గింపులను పొందే అవకాశం ఉంది. ఈ కార్డు ద్వారా రూ. 5,000 కంటే ఎక్కువ లావాదేవీలు, క్రెడిట్ EMI లావాదేవీలను జరిపినప్పుడు ఫ్లాట్ 10% తగ్గింపును పొందవచ్చు. ఈ సేల్​లో ఒక కార్డు ద్వారా రూ. 1,750 వరకు గరిష్ఠ తగ్గింపు పొందే అవకాశం ఉంది. అదనంగా ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు కస్టమర్లు రూ. 24,990 కంటే ఎక్కువ నెట్ కార్ట్ విలువ కలిగిన ఆర్డర్‌లపై .. ఫ్లాట్ రూ.750 తగ్గింపు, రూ. 79,990 కంటే ఎక్కువ ఆర్డర్‌లపై ఫ్లాట్ రూ.3,000 తగ్గింపును పొందవచ్చు. అయితే ఈ ఆఫర్‌లు ICICI బ్యాంక్ కార్పొరేట్ లేదా కమర్షియల్ కార్డ్‌లకు వర్తించవని వినియోగదారులు గమనించాలి.

కోటక్ మహీంద్రా బ్యాంక్ : కోటక్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించే కస్టమర్‌లు ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2023లో ఆకర్షణీయమైన తగ్గింపులను పొందవచ్చు. ఈ కార్డు ఉన్నవారు రూ. 5,000 కంటే ఎక్కువ కొనుగోళ్లపై 10% తక్షణ తగ్గింపును పొందవచ్చు. గరిష్ఠంగా రూ. 1,250 వరకు ఈ తగ్గింపును పొందే ఛాన్స్ ఉంది. ఇందులో రూ. 5,000 అంతకంటే ఎక్కువ జరిపే EMI లావాదేవీలపై 10 శాతం డిస్కౌంట్​తో గరిష్ఠంగా రూ.1,500 వరకు తగ్గింపును పొందే అవకాశం ఉంది. ఈ కార్డు వినియోగదారులు అదనంగా, రూ. 24,990 అంతకంటే ఎక్కువ నికర కార్ట్ విలువపై రూ. 750 తగ్గింపు, రూ. 79,990 అంతకంటే ఎక్కువ నికర కార్ట్ విలువపై రూ. 3,000 తగ్గింపు పొందే ఛాన్స్ ఉంది. ఇంకెందుకు ఆలస్యం పైన పేర్కొన్న కార్డులు ఉన్నవారు ఇప్పుడే ఫ్లిప్​కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2023లో తమకు నచ్చిన వస్తువును ఆర్డర్​ పెట్టి ఆర్థికంగా కొంతమేర లాభాన్ని పొందండి.

Amazon Great Indian Festival 2023 : స్మార్ట్​ఫోన్స్​పై 49%, ల్యాప్​టాప్స్​పై 45% వరకు డిస్కౌంట్​.. అమెజాన్, ఫ్లిప్​కార్ట్​ కిరాక్​ డీల్స్​​!

How to Find If Festive Offers are Fake Or Real ? : ఆన్​లైన్ ఫెస్టివల్​ ఆఫర్​లో షాపింగ్ చేస్తున్నారా..? ఒక్క నిమిషం బాస్.. కొంపలు మునిగిపోతాయ్..!

IPhone Offers In October 2023 : ఫ్లిప్​కార్ట్​, అమెజాన్​ పండుగ సేల్​లో.. రూ.40 వేలకే ఐఫోన్​ 13.. రూ.20,000 డిస్కౌంట్​తో ఐఫోన్​ 14!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.