Flights Ban DGCA: ఎంపిక చేసిన అంతర్జాతీయ ప్రయాణీకుల విమాన సర్వీసులను 2022 జనవరి 31 వరకు నిలిపివేయనున్నట్లు డీజీసీఏ ప్రకటించింది. కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. డిసెంబర్ 1 నుంచి 15 వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులను పునరుద్ధరించొద్దని కేంద్రం నిర్ణయించింది. తాజాగా దీనిని వచ్చే ఏడాది జనవరి 31 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.
కరోనా విజృంభణ కారణంగా 2020 మార్చి 23 నుంచి అంతర్జాతీయ ప్రయాణీకుల విమానాలను భారత్ నిలిపేసింది. అయితే.. 2020 మే నుంచి వందే భారత్ మిషన్ కింద, 2020 జులై నుంచి ఎంపిక చేసిన దేశాల నుంచి ద్వైపాక్షిక అంతర్జాతీయ విమానాలను అనుమతిస్తోంది.
Flight Ban Extended: అమెరికా, బ్రిటన్, యూఏఈ, కెన్యా, భూటాన్, ఫ్రాన్స్ సహా దాదాపు 32 దేశాల నుంచి ప్రత్యేక బయో బబుల్ ఏర్పాటు ప్రాతిపదికన విమానాలను నడుపేందుకు సంస్థలకు అనుమతినిచ్చింది.
ఇవీ చదవండి: