ETV Bharat / bharat

ఎంపీలో దారుణం- ఐదేళ్ల బాలికపై అత్యాచారం - మధ్యప్రదేశ్​ శోవోపుర్​ జిల్లాలో చిన్నారిపై రేప్​

అభం శుభం తెలియని ఐదేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు విరుచుకుపడ్డాడు. ఇంటి బయట ఆడుకుంటుండగా.. బాలికకు మాయమాటలు చెప్పి తీసుకువెళ్లి, అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్​లో జరిగింది.

five year old girl raped
మధ్యప్రదేశ్​లో దారుణం.. 5 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం
author img

By

Published : Feb 7, 2021, 3:21 PM IST

మధ్యప్రదేశ్​లోని శేవోపుర్​లో జిల్లాలో అమానవీయ ఘటన వెలుగు చూసింది. ఐదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ దుర్మార్గుడు.

ఏం జరిగిందంటే..

విజయ్​పుర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన ఐదేళ్ల బాలిక.. శనివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో తన ఇంటి బయట ఆడుకుంటోంది. ఈ క్రమంలో.. సూరజ్​ అనే 20 ఏళ్ల వ్యక్తి.. చిన్నారికి మాయమాటలు చెప్పి, సమీపంలోని ఆవతోటలోకి తీసుకువెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఏడుస్తూ ఇంటికి వచ్చిన చిన్నారి.. జరిగిన విషయం తన తల్లికి చెప్పింది. ఈ మేరకు బాధిత చిన్నారి కుటుంబ సభ్యులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.

మధ్యప్రదేశ్​లో దారుణం.. 5 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం

ఆ గ్రామం పోలీస్​ స్టేషన్​కు​ దూరంగా ఉన్నందున.. ఈ ఘటన గురించి బాలిక కుటుంబ సభ్యులు ఆదివారం ఉదయం ఫిర్యాదు చేశారు. ఈ ఘోరానికి పాల్పడ్డ అనంతరం.. గ్రామం నుంచి నిందితుడు పరారయినట్లు తెలుస్తోంది.

నిందితుడిపై అత్యాచారం​ సహా.. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని విజయ్​పుర్​ పోలీస్​ స్టేషన్​ అధికారి టీఐ సురేష్ చంద్​ పటేరియా వెల్లడించారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు.

ఇదీ చదవండి:చెప్పుల దండతో మహిళకు అవమానం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.