Boy Died following Snake Bite : తల్లిని కాపాడబోయి ఐదేళ్ల బాలుడు పాము కాటుకు గురయ్యాడు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బాలుడు మృతి చెందాడని వైద్యులు నిర్ధరించారు. ఈ ఘటన తమిళనాడు తూత్తుకుడి జిల్లాలోని సౌత్ కుప్పనపురం అనే గ్రామంలో శుక్రవారం జరిగింది.
వివరాల ప్రకారం.. పెరుమాల్ అనే వ్యక్తి సౌత్ కుప్పనపురం గ్రామంలో భార్య, ఇద్దరు కుమారులతో నివాసం ఉంటున్నారు. పెద్ద కుమారుడు తల్లితో వంటగదిలో ఉండగా.. గోడ పక్కన ఉన్న రంధ్రంలో నుంచి పాము రావడం గమనించాడు. పాము తన తల్లి వద్దకు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశాడు. సర్పం ఆ చిన్నారిని కాటు వేసింది. దీంతో బాలుడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ప్రథమ చికిత్స కోసం బాలుడిని కదంబుర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం తిరునెల్వేలిలోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. బాలుడు చనిపోయాడని వైద్యులు నిర్ధరించారు. దీంతో ఆ గ్రామంలో విషాధ ఛాయలు అలుముకున్నాయి.
విషయం తెలుసుకున్న పోలీసులు ఆస్పత్రికి వెళ్లారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ఇవీ చదవండి: కాటన్‌కు బదులు కండోమ్ కవర్లతో చికిత్స, పీహెచ్సీ సిబ్బంది నిర్లక్ష్యం
హైవేకు అడ్డంగా రైతు డ్రీమ్ హౌస్, కూల్చడం ఇష్టం లేక 500 అడుగులు వెనక్కి