ETV Bharat / bharat

మతిస్తిమితం లేని మైనర్​పై​ 6 నెలలుగా అత్యాచారం - మహారాష్ట్రలో ఏడేళ్ల బాలికపై అత్యాచారం

తమిళనాడు తిరువనంతపురంలో మతిస్థిమితం కోల్పోయిన ఓ మైనర్​పై ఆరు నెలలు అత్యాచారానికి పాల్పడ్డారు ఐదుగురు కామాంధులు. ఉత్తర్​ప్రదేశ్​లో జరిగిన మరో దారుణ ఘటనలో 12 ఏళ్ల బాలికపై నలుగురు అత్యాచారం చేశారు.

rape incidents in states
వేర్వేరు రాష్ట్రాల్లో నాలుగు అత్యాచారాలు
author img

By

Published : Apr 12, 2021, 5:43 AM IST

దేశంలో అత్యాచార ఘటనలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. తమిళనాడు, హరియాణా, ఉత్తర్​ప్రదేశ్​, మహారాష్ట్రలో అమానవీయ ఘటనలు వెలుగు చూశాయి.

ఆరు నెలలు అత్యాచారం..

తమిళనాడు తిరువనంతపురంలో మతిస్తిమితం కోల్పోయిన ఓ మైనర్​పై ఆరు నెలలు అత్యాచారానికి పాల్పడ్డారు ఐదుగురు కామాంధులు. కరోనా నేపథ్యంలో విధించిన లాక్​డౌన్ సమయంలో కడలూరులోని బంధువుల ఇంటివద్ద నివసిస్తున్న బాధితురాలిని పలుమార్లు రేప్​ చేశారు.

బాలిక ఆరోగ్యం పూర్తిగా క్షీణించిన నేపథ్యంలో అసలు విషయం బయటపడింది. వెంటనే బాధితురాలి బంధువులు ఆల్-ఉమెన్​ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం బాధితురాలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పేర్కొన్నారు.

హరియాణాలో ఒడిశా యువతిపై

ఆరు నెలల పాటు వేర్వేరు ప్రాంతాల్లో చాలా మంది తనపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన హరియాణాలోని హిసార్​లో జరిగింది.

ఒడిశా ఎలినాబాద్​కు చెందిన ఈ మహిళ తన స్నేహితురాలు జమీనాతో కలిసి 2020 మార్చిలో హిసార్​కు వచ్చినట్లు పోలీసులకు తెలిపింది. రింకు, విజయ్, దేవా, జమీనా, నర్మిల అనే ఐదుగురు నిందుతులపై కేసు నమోదు చేసింది.

ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.

యూపీలో..

12 ఏళ్ల బాలికపై నలుగురు అత్యాచారం చేసిన దారుణ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని మథురలో ఆదివారం జరిగింది. ఈ కేసుకు సంబంధించి ముగ్గురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఓ వ్యక్తి పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. మైనర్​ను వైద్య పరీక్షలకు పంపినట్లు చెప్పారు.

మహారాష్ట్రల్లో ఏడేళ్ల బాలిక..

మహారాష్ట్ర లాతూర్​ ప్రాంతంలో ఏడేళ్ల బాలికను అత్యాచారం చేసిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. గతవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితుడు ఎరండి-సరోలా గ్రామానికి చెందిన వాడని పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:మహారాష్ట్రలో ఒక్కరోజే 63,294 కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.