Five Drowned Dead: మహరాష్ట్రలో విషాదం జరిగింది. ఇద్దరు మహిళలు తమ పిల్లలను వెంట తీసుకుని బట్టలు ఉతకడానికి గ్రామంలో చెరువు వద్దకు వెళ్లారు. ప్రమాదవశాత్తు ఐదుగురు నీట మునిగి చనిపోయారు. మరణించిన వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం వల్ల ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
పోలీసుల వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని డోంబివాలి సమీప గ్రామాల్లో గత కొన్ని రోజులుగా నీటి ఎద్దడి నెలకొంది. ఈ క్రమంలో సందప్ గ్రామానికి చెందిన గైక్వాడ్ కుటుంబంలో ఇద్దరు మహిళలు తమ పిల్లలను తీసుకుని బట్టలు ఉతకడానికి చెరువు వద్దకు వెళ్లారు. శనివారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో అదుపు తప్పి ఐదుగురు నీట మునిగి చనిపోయారు. మరణించిన వారిని మీరా గైక్వాడ్(55), ఆమె కోడలు ఆపేక్ష(30), మయూరేశ్(15), మోక్ష(13), నీలేశ్గా (15) పోలీసులు గుర్తించారు. ఐదుగురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక శాస్త్రినగర్ ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి: 'జై భీమ్' తరహా ఘటన.. లాకప్ డెత్ కేసులో పోలీసులు అరెస్టు