దేశంలో పలువురు ప్రముఖులు మంగళవారం కరోనా టీకా తీసుకున్నారు. భారత దేశ ప్రథమ ఓటరు శ్యామ్ శరణ్ నేగి.. టీకా తీసుకున్నారు. హిమాచల్ ప్రదేశ్లోని కిన్నోర్ ఆరోగ్య విభాగ వైద్యులు.. నేగిని భుజాలపై తీసుకెళ్లి, టీకా తొలి డోసు వేశారు. వ్యాక్సిన్ తీసుకోవడంపై సంతోషం వ్యక్తం చేశారు నేగి. ఈ నేపథ్యంలో దేశ ప్రజలందరూ టీకా వేయించుకోవాలని సూచించారు.
టీకా తీసుకున్న నడ్డా
భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. దిల్లీలో కరోనా టీకా తొలి డోసు వేయించుకున్నారు.
కరోనాపై పోరులో ప్రపంచానికి భారత్ నాయకత్వం వహించే స్థాయికి ఎదిగిందన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. ప్రపంచంలోనే భారీ వ్యాక్సినేషన్ కార్యక్రమం భారత్లో జరుగుతుందని చెప్పారు.
భాజపా సీనియర్ నేత ఎల్కే అడ్వాణీతో పాటు డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కూడా కరోనా టీకా వేయించుకున్నారు.
ఇదీ చూడండి: 'కొవాగ్జిన్ సేఫ్.. దుష్ప్రభావాలు లేవు'