ETV Bharat / bharat

కరోనాతో ఎన్​ఎస్​జీ గ్రూప్ కమాండర్ మృతి - ఎన్​ఎస్​జీ కమాండో కరోనాతో మృతి

జాతీయ భద్రతా దళం(ఎన్​ఎస్​జీ)లో తొలి కరోనా మరణం బుధవారం నమోదైంది. గ్రూప్ కమాండర్ బీకే ఝా(53).. కొవిడ్​-19తో మృతిచెందినట్లు అధికారులు తెలిపారు.

NSG
ఎన్​ఎస్​జీ
author img

By

Published : May 5, 2021, 6:37 PM IST

జాతీయ భద్రతా దళానికి చెందిన గ్రూప్ కమాండర్​ బీకే ఝూ(53).. కొవిడ్​-19 బారిన పడి మరణించినట్లు అధికారులు తెలిపారు. ఎన్ఎస్​జీలో ఇది మొదటి కరోనా మరణమని పేర్కొన్నారు.

"బిహార్​కు చెందిన ఝా.. 1993 బ్యాచ్ అధికారి. 2018లో బీఎస్​ఎఫ్​ నుంచి ఎన్​ఎస్​జీలో చేరారు. ఝా మరణంపై కేంద్ర హోం శాఖ.. సంఘీభావం ప్రకటించింది" అని ఎన్​ఎస్​జీ తన అధికారిక ట్విట్టర్​లో పేర్కొంది. ఝా కుటుంభ సభ్యులకు అండగా ఉంటామని తెలిపింది.

ఎన్​ఎన్​జీలో ఇప్పటివరకు 430 మందికి వైరస్​ సోకగా.. ప్రస్తుతం 59 మంది చికిత్స తీసుకుంటున్నారు. మొత్తం సీఏపీఎఫ్​ (సీఆర్​పీఎఫ్, బీఎస్​ఎఫ్, ఐటీబీపీ, సీఐఎస్​ఎఫ్, ఎస్ఎస్​బీ) బలగాల్లో ఇప్పటివరకు 66వేల మందికిపైగా వైరస్ బారినపడ్డారు. వారిలో ప్రస్తుతం 7,900మంది చికిత్స పొందుతున్నారు.

ఇదీ చదవండి : కరోనా కట్టడికి రాష్ట్రాల ఆంక్షల వ్యూహం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.