83 మంది మొదటి మహిళా సైనికులు భారత సైన్యంలో చేరారు. కార్ప్స్ ఆఫ్ మిలటరీ పోలీస్ సెంటర్(సీఎంపీ) నుంచి వీరిని బెంగళూరులోని ద్రోణాచార్య పరేడ్ గ్రౌండ్ వేదికగా సైన్యంలో చేర్చారు.
61 వారాల శిక్షణ పూర్తి చేసుకుని సైన్యంలో చేరిన మహిళా జవాన్లను సీఎంపీ కమాండెంట్ అభినందించారు. ఇక్కడ సైనికులు తీసుకున్న శిక్షణ, సాధించిన నైపుణ్యాలు వారిని ఉన్నత స్థితిలో ఉంచుతాయని అన్నారు. దేశంలోని విభిన్న భూభాగాలు, పరిస్థితులలో రాణించడానికి ఇవి సహాయపడతాయని కమాండెంట్ విశ్వాసం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: కేరళలో 300 కిలోల డ్రగ్స్ స్వాధీనం