ETV Bharat / bharat

భూతగాదాలో పేలిన తూటాలు.. నలుగురు మృతి

Land dispute firing: రెండు వర్గాల మధ్య కొనసాగుతున్న భూవివాదం నలుగురి ప్రాణాలు తీసింది. భూతగాదాలతో ఓ వర్గంపై మరోవర్గం కాల్పులు జరిపింది. ఈ ఘటన పంజాబ్​, గుర్​దాస్​పుర్​ జిల్లాలో సోమవారం జరిగింది.

shooting
భూతగాదాలో పేలిన తూటాలు
author img

By

Published : Apr 4, 2022, 5:18 PM IST

Land dispute firing: భూతగాదాల్లో రెండు గ్రూప్​ల మధ్య వివాదం కాల్పులకు దారి తీసింది. ఓ వర్గంపై మరో వర్గం కాల్పులు జరపటం వల్ల మొత్తం నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన పంజాబ్​లోని గుర్​దాస్​పుర్​ జిల్లాలో సోమవారం జరిగింది. జిల్లాలోని ఫుల్లారా గ్రామానికి చెందిన సుఖ్రాజ్​ సింగ్​.. మరో ఇద్దరు సహచరులు జమల్​ సింగ్​, నిశాన్​ సింగ్​తో కలిసి బీస్​ నగరానికి సమీపంలోని తన భూమిని చూసేందుకు వెళ్లాడు. అక్కడికి నిర్మల్​ సింగ్​ అనే వ్యక్తి తన సహచరులతో వచ్చి వారిపై కాల్పులకు తెగబడ్డారు. తూటాలు తగిలి సుఖ్రాజ్​ సింగ్​, జమల్​ సింగ్​, నిశాన్​ సింగ్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.

సమాచారం అందుకున్న డీఎస్​పీ కుల్విందర్​ సింగ్​.. సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఫుల్లారా గ్రామానికి చెందిన ముగ్గురితో పాటు దసుయాకు చెందిన మరో వర్గంలోని ఓ వ్యక్తి సైతం ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. ఒకరు గాయపడినట్లు తెలిపారు. సుఖ్రాజ్​ సింగ్​.. కాంగ్రెస్​ మాజీ సర్పంచ్​ లవ్​జిత్​ కౌర్​ భర్తగా గుర్తించారు. మృతదేహాలను పోస్ట్​మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం అక్కడికి చేరుకున్న బాధితుల కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్​ చేశారు.

ఇదీ చూడండి: బాయ్​ఫ్రెండ్​ కారణంగా గర్భం.. యూట్యూబ్ చూసి అబార్షన్​.. కానీ...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.