గుజరాత్ వడోదరలోని టింబర్ మార్కెట్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రెండు టింబర్ పరిశ్రమల్లో మంటలు భారీగా ఎగసిపడ్డాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. 16 అగ్నిమాపక యంత్రాలతో మంటలు ఆర్పుతున్నారు.



బాణసంచా పేలుడు కారణంగా అగ్ని ప్రమాదం సంభవించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 90శాతం మంటలను అదుపులోకి తెచ్చామని అగ్నిమాపక శాఖ ముఖ్యాధికారి పార్థ్ బ్రహ్మదత్ తెలిపారు.
ఇదీ చూడండి: eco friendly Diwali: మారుతున్న ఆలోచన.. గ్రీన్ క్రాకర్స్వైపు మొగ్గు