ETV Bharat / bharat

దిల్లీ ఆస్పత్రి ఐసీయూలో అగ్నిప్రమాదం - దిల్లీలో ఓ బట్టల దుకాణంలో అగ్ని ప్రమాదం

దిల్లీలో రెండు వేర్వేరు చోట్ల అగ్ని ప్రమాదాలు జరిగాయి. సఫ్దార్ జంగ్ ఆస్పత్రి ఐసీయూఓలో మంటలు అంటుకుని ప్రమాదం సంభవించింది. ఫైర్​, ఆస్పత్రి సిబ్బంది కలిసి 50 మంది రోగులను సురక్షితంగా వేరే వార్డుకు తరలించారు. మరోవైపు... రఘుబర్​పురలోని ఓ బట్టల దుకాణంలో మంటలు చెలరేగాయి.

2fire accidents in Delhi
దిల్లీలో రెండు చోట్ల అగ్ని ప్రమాదం
author img

By

Published : Mar 31, 2021, 11:19 AM IST

దిల్లీలోని సఫ్దార్ ​జంగ్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. బుధవారం ఉదయం 6:30 ప్రాంతంలో ఐసీయూలో మంటలు అంటుకున్నాయి. ఫైర్​, ఆస్పత్రి సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించి ఐసీయూలో ఉన్న 50 మంది రోగులను కాపాడారు. వారిని మరో వార్డుకు తరలించారు.

9 ఫైర్​ ఇంజిన్​లతో మంటలను అదుపు చేశారు ఫైరి సిబ్బంది. ఈ ఘటనలో ఎవరికీ ప్రాణాపాయం జరగలేదని అధికారులు తెలిపారు.

బట్టల దుకాణంలో మంటలు..

రఘుబర్​పుర ప్రాంతంలోని ఓ బట్టల దుకాణంలో ఉదయం 8:15 సమయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలను గమనించిన స్థానికులు ఫైర్​ సిబ్బందికి సమాచారమిచ్చారు. 15 ఫైర్​ ఇంజిన్లు రంగంలోకి దిగాయి.

ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా.

బట్టల దుకాణంలో మంటలు అదుపు చేస్తున్న ఫైర్ సిబ్బంది

రెండు చోట్ల అగ్ని ప్రమాదానికి కారణాలేమిటో ఇంకా తెలియాల్సి ఉంది.

ఇదీ చదవండి:భర్త కళ్ల ముందే భార్యపై గ్యాంగ్​ రేప్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.