ETV Bharat / bharat

చీమలపాడు అగ్నిప్రమాద ఘటన... నాలుగుకు చేరిన మృతుల సంఖ్య - BRS meeting canceled in Chimalapadu

Fire accident
Fire accident
author img

By

Published : Apr 12, 2023, 12:58 PM IST

Updated : Apr 13, 2023, 6:56 AM IST

12:50 April 12

కారేపల్లి మండలం చీమలపాడులో అగ్నిప్రమాదం

ఖమ్మం జిల్లాలో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి

Fire accident at Karepalli : ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళన సమావేశ వేదిక సమీపంలో జరిగిన అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. సమావేశానికి ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు, వైరా ఎమ్మెల్యే రాములు నాయక్‌ వస్తున్న సందర్భంగా బీఆర్​ఎస్ కార్యకర్తలు బాణసంచా పేల్చారు. ఆ నిప్పురవ్వలు ఎగిసిపడి సమీపంలోని గుడిసెపై పడడంతో మంటలు చెలరేగాయి. వాటిని అదుపుచేసేందుకు అక్కడే ఉన్న పోలీసులు, స్థానికులు బిందెలతో నీళ్లు చల్లారు. మంటల తాకిడికి గుడిసెలో ఉన్న సిలిండర్‌ను ఎవరూ గమనించలేదు. ఈ క్రమంలో అది ఒక్కసారిగా పెద్దశబ్దంతో పేలింది. సిలిండర్‌ పేలుడు ధాటికి 10 మంది తీవ్రంగా గాయపడ్డారు.

Khammam Fire Accident update : పేలుడు వల్ల సిలిండర్‌ తునాతునకలై దాని శకలాలు ఎగిరొచ్చి పలువురు గాయపడ్డారు. బాధితుల శరీరభాగాలు ఛిద్రమై పరిస్థితి హృదయవిదారకంగా మారింది. క్షతగాత్రులను పోలీసు వాహనాల్లో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మార్గమధ్యలో ఒకరు... ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృత్యువాతపడ్డారు. తీవ్రంగా గాయపడిన వారిలో నలుగురిని హైదరాబాద్ నిమ్స్​కి తరలిస్తుండగా మరో ఇద్దరు మృతి చెందారు. దీంతో ఈ ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. మృతులను బానోతు రమేశ్, అంగోతు మంగు, సందీప్, లక్ష్మణ్​లుగా పోలీసులు గుర్తించారు.

ప్రభుత్వం, పార్టీ పరిహారం: ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనేందుకు వచ్చి మృత్యువాతపడ్డ కార్యకర్తలు, క్షతగాత్రులను అన్ని విధాలా ఆదుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. ప్రమాదంలో మృత్యువాతపడ్డ వారి కుటుంబాలకు ప్రభుత్వం తరపున రూ.10 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. క్షతగాత్రులకు ఒక్కొక్కరికీ రూ.2లక్షల చొప్పున ప్రభుత్వం తరపున అందిస్తామని రవాణాశాఖ మంత్రి పువ్వాడ ప్రకటించారు. క్షతగాత్రులందరికీ పూర్తిగా ఉచితంగా వైద్యం అదిస్తామని తెలిపారు.

ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు, బీఆర్​ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతామధుసూదన్ ఈ ఘటన తమను తీవ్రంగా కలచి వేసిందన్నారు. పార్టీ కార్యకర్తల కుటుంబాలకు అన్నివిధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పార్టీ తరపున మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, క్షతగాత్రులకు రూ.2 లక్షలు ప్రకటించారు. నామా ముత్తయ్య ట్రస్టు తరపున మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడ్డవారికి రూ.50 చొప్పున ప్రకటించారు. మృతిచెందిన ముగ్గురు పార్టీ కార్యకర్తల కుటుంబాలకు వైరా ఎమ్మెల్యే రాములునాయక్ రూ.2లక్షలు ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.లక్ష చొప్పున అందించనున్నట్లు వెల్లడించారు.

రూ.50 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి : ఖమ్మం జిల్లా కారేపల్లి మం. చీమలపాడు వద్ద ఉద్రిక్తత నెలకొంది. అగ్నిప్రమాద ఘటనలో మృతి చెందిన అంగోతు మంగు మృతదేహం చీమలపాడుకు చేరుకోవడంతో.. మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు మృతదేహాన్ని వాహనంలోనే ఉంచి నిరసన వ్యక్తం చేశారు. మంగు మృతదేహంతో రోడ్డుపై బైఠాయించి గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. రూ.50 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి:

Last Updated : Apr 13, 2023, 6:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.