ETV Bharat / bharat

ఫర్నీచర్​ షాప్​లో భారీ అగ్నిప్రమాదం.. ఒకే కుటుంబంలోని ఆరుగురు దుర్మరణం

ఉత్తర్​ప్రదేశ్​లో ఓ ఫర్నీచర్​ దుకాణంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతిచెందగా మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.

fire accident in uttarpradesh firozabad
fire accident
author img

By

Published : Nov 30, 2022, 6:48 AM IST

Updated : Nov 30, 2022, 7:08 AM IST

UP Fire Accident: ఉత్తర్​ప్రదేశ్​లోని ఫిరోజాబాద్​లో ఉన్న ఓ ఫర్నీచర్​ దుకాణంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతిచెందారు. అందులో నలుగురు చిన్నారులు ఉన్నారు. మరో ముగ్గురికి తీవ్రగాయలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. షాపులో షార్ట్​ సర్క్యూట్​ అవ్వడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.

మంటలు వేగంగా వ్యాపించడం వల్ల దుకాణంతో పాటు మొదటి అంతస్థులో ఉన్న యజమాని ఇల్లు కూడా దగ్ధమైంగి. ఆగ్రా, మెయిన్‌పురి, ఇటా ,ఫిరోజాబాద్‌ల నుంచి 18 అగ్నిమాపక దళ వాహనాలతో పాటు 12 పోలీస్​స్టేషన్‌ల సిబ్బంది దాదాపు రెండున్నర గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్‌ నిర్వహించారు. ఘటనపై స్పందించిన ఉత్తర్​ప్రదేశ్​ సీఎం యోగి​ సంతాపం వ్యక్తం చేశారు. మృతి చెందిన వారి కుటుంబానికి రూ.2 లక్షల ఎక్స్​గ్రేషియాను ప్రకటించారు.

Last Updated : Nov 30, 2022, 7:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.