Fire Accident In Khammam : ఖమ్మం జిల్లాలోని ఖమ్మం పత్తి మార్కెట్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంతో మార్కెట్‌లో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. మార్కెట్‌లో ఏర్పడిన మంటలు.. అక్కడ ఉన్న పత్తి బస్తాలకు అంటుకున్నాయి. ఈ అగ్నికీలల్లో సుమారు 1600 పత్తి బస్తాలు అగ్నికి కాలి బూడిదయ్యాయి. ఎక్కువ మొత్తంలో పత్తి బస్తాలకు మంటలు అంటుకోవడంతో.. ఆ ప్రాంతం మొత్తం దట్టమైన పొగ అలుముకుంది. మార్కెట్‌లో ఉన్న రైతులు, వ్యాపారులు, కూలీలు ప్రాణ భయంతో పరుగులు తీశారు.
రైతుల నుంచి వ్యాపారి పత్తి కొనుగోలు చేసి నిల్వ చేశాడు.. ఈ క్రమంలో అగ్ని ప్రమాదం జరగడంతో వ్యాపారికి భారీగానే ఆస్తి నష్టం జరిగింది. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో.. ఘటనా స్థలానికి చేరుకొని మూడు అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపు చేస్తున్నారు. ప్రమాదంలో సుమారు రూ.1.25 కోట్ల ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
అగ్నికి ఆహుతైన బియ్యం : మరో ప్రమాదంలో మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలోని మహదేవ్ ఇండస్ట్రీలో షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంటలు ఎగిసి పడుతున్నాయి. రైస్ మిల్లులో పొగలు రావడాన్ని గమనించిన స్థానికులు ఫైర్, పోలీస్ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని.. ఎగిసిపడుతున్న మంటలను 3 ఫైర్ ఇంజన్లతో అదుపు చేశారు. మంటలకు చాలా ధాన్యం బస్తాలు కాలిపోయాయి. ఆరుబయట, పక్కనే ఉన్న ధాన్యం బస్తాలకు మంటలు అంటు కోకుండా హమాలీలు బయటకు తరలించారు. ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించారు. భారీ నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియవలసి ఉంది
ఇవీ చదవండి :