ETV Bharat / bharat

ఎఫ్​ఐఆర్​ అంటే పోర్నోగ్రఫీ కాదు.. అవన్నీ ఎలా రాస్తారు?: హైకోర్టు - ఎఫ్​ఐఆర్

ఎఫ్​ఐఆర్ నమోదు ప్రక్రియపై కీలక వ్యాఖ్యలు చేసింది అలహాబాద్ హైకోర్టు. ఎఫ్​ఐఆర్​ అంటే పోర్నోగ్రఫీ కాదని, అందులో ఇబ్బంది కలిగించే మాటలు ఎలా రాస్తారని ఘాటుగా స్పందించింది. ఓ కుటుంబ వివాదంపై విచారణ సందర్భంగా ఈ మేరకు వ్యాఖ్యానించింది.

FIR is not pornography
allahabad high court on fir
author img

By

Published : Jun 14, 2022, 5:51 PM IST

Allahabad High Court on FIR: ఓ కుటుంబ వివాదంపై విచారణ సందర్భంగా పోలీసు స్టేషన్లలో ఎఫ్​ఐఆర్​ నమోదుపై కీలక వ్యాఖ్యలు చేసింది అలహాబాద్ హైకోర్టు. ఎఫ్​ఐఆర్​ అంటే పోర్నోగ్రఫీ కాదని, అందులో జుగుప్సాకరమైన మాటలను పొందుపర్చాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఎఫ్​ఐఆర్​ నమోదు చేసేటప్పుడు గౌరవప్రదమైన భాష వాడటంలో న్యాయవాదుల పాత్ర ముఖ్యమని చెప్పింది. కుటుంబ వివాదాలను పరిష్కారం కోసం కుటుంబ సంక్షేమ కమిటీలను ఏర్పాటు చేసి అక్కడికి పంపాలని హైకోర్టు పేర్కొంది.

దాంతో పాటు కూలింగ్ పీరియడ్​లో (ఎఫ్​ఐఆర్ నమోదు చేసిన 2 నెలల కాలం) అరెస్టు చేయరాదని హైకోర్టు స్పష్టంచేసింది. ఈ తీర్పును ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వం, చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ లా, జిల్లా కోర్టులకు పంపించాలని హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్​కు సూచించింది. మూడు నెలల్లోగా ఫ్యామిలీ వెల్ఫేర్ కమిటీలను ఏర్పాటు చేసి, పనులు ప్రారంభించాలని జస్టిస్ రాహుల్ చతుర్వేది ఆదేశించారు.

ఈ కేసులో వాది ఎఫ్​ఐఆర్​ చదువుతుంటే అసహ్యం కలుగుతోందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఎఫ్​ఐఆర్​ అనేది సమాచారం ఇవ్వడానికేనని, అశ్లీల సాహిత్యం మాదిరి రోత పుట్టించే పదాలను చొప్పించేందుకు కాదని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఇక న్యాయవాదులు కూడా చాలాసార్లు విషయాన్ని పెద్దది చేసి చెప్తారని, ఈ క్రమంలో భాషా పరిధులను దాటుతారని అభిప్రాయపడింది. ఎఫ్​ఐఆర్​లో సమాచారం మాత్రమే ఇవ్వాలని నొక్కిచెప్పింది. వివాహాలకు సంబంధించిన వివాదాల్లో రెండు నెలల వరకు ఎలాంటి అరెస్టులూ చేయరాదని, ఈ కేసులను త్వరితగతిన కుటుంబ సంక్షేమ కమిటీలకు పంపాలని ఆదేశించింది.

ఇదీ చూడండి: సెకండ్ డే, సెకండ్ రౌండ్.. రాహుల్​పై ఈడీ ప్రశ్నల వర్షం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.