రైతు సంఘం నాయకుడు రాకేశ్ తికాయత్పై కేసు నమోదు చేశారు దిల్లీ పోలీసులు. దేశ రాజధానిలో మంగళవారం జరిగిన ఘటనపై ఇప్పటికే పలువురి ఎఫ్ఐఆర్ నమోదు చేయగా.. తాజాగా తికాయత్ సహా మరికొందరిపై కేసు పెట్టినట్లు అధికారులు తెలిపారు.
'ఏ రైతు నాయకుడిపై కేసు నమోదైనా.. అది దేశంలోని రైతులపై నమోదైనట్లే' అని ఈ విషయంపై స్పందించారు తికాయత్.
ఐటీఓ, ఎర్రకోట ఘటనపై ఇప్పటివరకు 22 కేసులు నమోదు చేసి, 200 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. రైతులు, పోలీసుల మధ్య జరిగిన ఘర్షణల్లో 300 మందికి పైగా పోలీసులు గాయపడినట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి: 'గణతంత్ర పరేడ్'పై 22 ఎఫ్ఐఆర్లు.. భద్రత కట్టుదిట్టం