Fine To Dmart : గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఉన్న డీమార్ట్‌కు వినియోగదారుల కోర్టు షాక్ ఇచ్చింది! కాలం చెల్లిన బెల్లం అమ్మినందుకు రూ.లక్షా పదివేలు జరిమానా విధించింది. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతమవ్వకుండా చూడాలని స్పష్టం చేసింది. అసలేం జరిగందంటే?
8 నెలల క్రితం..
గాంధీనగర్‌కు చెందిన పంకజ్ అహిర్ అనే వ్యక్తి.. 8నెలల క్రితం స్థానికంగా ఉన్న డీమార్ట్‌కు వెళ్లాడు. తన ఇంటికి అవసరమైన కిరాణా సామగ్రితో పాటు రెండు డబ్బాల్లో ప్యాక్ చేసి ఉన్న బెల్లం కొనుగోలు చేశాడు. అయితే ఆ డబ్బాలపై కంపెనీ ఎక్స్పైరీ డేట్ చూసి షాకయ్యాడు. వెంటనే గాంధీనగర్ వినియోగదారుల కోర్టులో కేసు వేశాడు. 8 నెలల తర్వాత గాంధీనగర్ వినియోగదారుల కోర్టు తీర్పునిచ్చింది. రూ.100 బదులు రూ.1.10 లక్షలను కస్టమర్‌కు చెల్లించాలని ఆదేశించింది. అయితే తాను వినియోగదారులను జాగృతం చేసే లక్ష్యంతోనే ఈ పని చేశానని పంకజ్ అహిర్.. ఈటీవీ భారత్‌తో తెలిపాడు.
రాజీ పడమని కోరినా తగ్గేదేలే!
"గాంధీనగర్ వినియోగదారుల కోర్టులో కేసు వేసిన తర్వాత.. కంపెనీ నన్ను సంప్రదించింది. కేసును ఉపసంహరించుకోవాలని కోరింది. రాజీపడి సమస్యను పరిష్కరించుకుందామని చెప్పింది. అందుకు నేను ఒప్పుకోలేదు. కాలం చెల్లిన పదార్థాల వల్ల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతోంది. ఆరోగ్యం విషయంలో రాజీ పడకూడదని దృష్టిలో ఉంచుకుని ఆ నిర్ణయం తీసుకున్నా" అని పంకజ్ అహిర్ చెప్పాడు.
డీమార్ట్ ఓనర్ కొత్త ఇల్లు..
Dmart Owner House In Mumbai : డీమార్ట్ వ్యవస్థాపకుడు రాధాకిషన్ దమానీ.. కొన్ని నెలల క్రితం కొన్న కొత్త ఇంటి ఫొటోలు.. ఇటీవల బయటకు వచ్చాయి. దాదాపు రూ.1238 కోట్లు విలువైన ఈ ఇంటిని 2023 ఫిబ్రవరిలో దమానీ కొనుగోలు చేశారు. ఈ ఇంటికి సంబంధించిన ఫొటోలను.. ఓ వ్యాపార సంస్థ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. దిగ్గజ బిలియనీర్లకు నిలయమైన ముంబయి నగరంలోనే.. ఈ కొత్త ఇంటిని కోట్లు ఖర్చు చేసి కొన్నారు రాధాకిషన్ దమానీ. ప్రస్తుతం రూ.13,658 కోట్ల సంపద కలిగిన దమానీ.. తన కుటుంబ సభ్యులు, స్నేహితుల కోసం దక్షిణ ముంబయిలో 28 ఫ్లాట్లతో కూడిన హై-ఎండ్ రెసిడెన్షియల్ భవనాన్ని కొనుగోలు చేశారు. ఆ ఫొటోలు చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
డీమార్ట్‌లో కుళ్లిన ఖర్జూరాలు.. సీజ్ చేసిన అధికారులు
డీమార్ట్‌లో క్యారీ బ్యాగ్స్ కొంటున్నారా? అయితే ఇది చదవాల్సిందే..!