ETV Bharat / bharat

పట్టపగలే నడిరోడ్డుపై ఫైనాన్స్​ వ్యాపారి దారుణ హత్య.. - finance owner murder

Finance Owner Murder: పట్టపగలే నడిరోడ్డుపై ఫైనాన్స్ వ్యాపారిని ఆరుగురు దుండగులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన తమిళనాడులోని చెన్నైలో జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

Finance company owner hacked to death i
Finance company owner hacked to death i
author img

By

Published : May 21, 2022, 5:52 AM IST

పట్టపగలే నడిరోడ్డుపై ఫైనాన్స్​ వ్యాపారి దారుణ హత్య..

Finance Owner Murder: తమిళనాడులోని చెన్నైలో దారుణం జరిగింది. నగరానికి చెందిన ఓ ఫైనాన్స్​ కంపెనీ యజమానిని పట్టపగలే నడిరోడ్డుపై ఆరుగురు దుండగులు నరికి చంపారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి.. సీసీటీవీ ఫుటేజ్​ల ఆధారంగా దర్యాప్తు చేపడుతున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం..
చెన్నైలోని చెట్​పేట్​కు చెందిన ఆరుముగం.. ఫైనాన్స్​ కంపెనీ నడుపుతున్నాడు. బుధవారం అతడు తన స్నేహితుడు రమేష్​తో కలిసి అన్నానగర్​లో ఉన్న ఫైనాన్స్​ కార్యాలయానికి వెళుతున్నాడు. మార్గమధ్యలో వారిని అడ్డగించిన దుండగులు నరికి చంపారు. వెంటనే ఘటనాస్థలం నుంచి నిందితులు పారిపోయారు. హత్య కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది

మృతి చెందిన ఫైనాన్స్​ కంపెనీ యజమాని
మృతి చెందిన ఫైనాన్స్​ కంపెనీ యజమాని

బుధవారం జరిగిన ఘటనకు సంబంధించి..చెన్నైలోని షెనాయ్​నగర్​కు చెందిన రోహిత్ రాజ్(31)​, చంద్రశేఖర్(28)​ అను ఇద్దరు యువకులు ఫైనాన్స్​ వ్యాపారిని హత్య చేశామని అంగీకరించి కోర్టులో లొంగిపోయారు. వారిద్దరికీ 15 రోజుల రిమాండ్​ విధిస్తున్నట్లు మేజిస్ట్రేట్​ ఆదేశించారు. ఇక, మరో నలుగురు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఇవీ చదవండి: యూట్యూబ్​ చూసి ఆయుధాలు తయారీ.. ఇద్దరు యువకులు అరెస్టు

2 మామిడిపండ్లు చోరీ.. మైనర్లను కట్టేసి చితకబాదిన యజమాని

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.