Fight for cricket ball: ఓ క్రికెట్ బాల్ గ్రామంలోని ఇరు వర్గాల మధ్య చిచ్చు పెట్టింది. ఆ బాల్‌ను కొన్నందుకు డబ్బులు ఎవరు ఇవ్వాలి అనే వివాదం చిలికిచిలికి గాలి వానలా మారి ఏకంగా రోడ్డు పైనే జుత్తులు పట్టుకుని కొట్టుకునే వరకు వచ్చింది. అంతటితో ఆగక కొందరు యువకులు కర్రలు తీసుకొని ఇష్టం వచ్చినట్లు పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మరికొందరు స్పల్పంగా గాయపడ్డారు.
ఏం జరిగిందంటే..
కర్ణాటక కలబుర్గిలోని గొబ్బోరా గ్రామంలో 5 రోజుల క్రితం క్రికెట్ టోర్నమెంట్ జరిగింది. ఇందులో ఉపయోగించిన క్రికెట్ బాల్‌కు డబ్బులు ఎవరు కట్టాలి అనే దానిపై వివాదం ప్రారంభమైంది. అది కాస్తా గొడవగా మారి చివరకు కర్రలతో దాడి చేసుకునే వరకు వచ్చింది. ఈ వివాదంలో గ్రామంలోని మహిళలు, యువకులు, పెద్దవాళ్లు అందరూ రోడ్డు పైగా వచ్చి పరస్పరం కొట్టుకున్నారు.
ఈ గొడవలో గాయపడిన వారిని కలబుర్గి జిల్లా ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చూడండి:
మృత్యువుతో 702 రోజులు పోరాడి ఓడిన బాలిక.. చెట్టు కొమ్మ వల్లే...