ETV Bharat / bharat

50% సీట్లలో ప్రభుత్వ కాలేజీలతో సమానంగా ఫీజులు - వైద్య కళాశాలల రుసుములు

Fees of medical colleges: ప్రైవేటు వైద్య కళాశాలలు, డీమ్డ్​ వర్సిటీల్లో రుసుములపై కీలక మార్గదర్శకాలు జారీ చేసింది జాతీయ వైద్య కమిషన్​. ఆయా ప్రాంతాల్లోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని ఫీజుల స్థాయిలో ఉండాలని స్పష్టం చేసింది. మొత్తంమీద సంబంధిత విద్యా సంస్థకు అనుమతించిన సీట్ల సంఖ్యలో గరిష్ఠంగా 50 శాతానికి దీన్ని పరిమితం చేయాలని సూచించింది.

NMC
జాతీయ వైద్య కమిషన్‌
author img

By

Published : Feb 6, 2022, 7:46 AM IST

ప్రైవేటు వైద్య కళాశాలలు, డీమ్డ్‌ విశ్వవిద్యాలయాల్లోని 50 శాతం సీట్ల రుసుములపై జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) మార్గదర్శకాలు జారీ చేసింది. అవి సంబంధిత రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని ఫీజుల స్థాయిలో ఉండాలని స్పష్టంచేసింది. ప్రభుత్వ కోటా సీట్లను పొందిన అభ్యర్థులకు మొదట ఈ ప్రయోజనాన్ని అందించాలంది. మొత్తంమీద సంబంధిత విద్యా సంస్థకు అనుమతించిన సీట్ల సంఖ్యలో గరిష్ఠంగా 50 శాతానికి దీన్ని పరిమితం చేయాలని సూచించింది. ప్రైవేటు వైద్య కళాశాలల్లో సాధారణంగా ఫీజులు ఎక్కువగా ఉంటాయి. అర్హత పరీక్షల్లో మెరుగైన స్కోరు సాధించినప్పటికీ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో సీట్లు పొందలేకపోయిన ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు దీనివల్ల ప్రయోజనం కలుగుతుంది.

కొన్ని కాలేజీల్లో ప్రభుత్వ కోటా సీట్లు 50 శాతం కన్నా తక్కువగా ఉంటున్నాయి. అలాంటిచోట అర్హత పరీక్షల్లో సాధించిన స్కోరు ఆధారంగా మిగతా విద్యార్థులను ఎంపిక చేసి, ఈ ఫీజు ప్రయోజనాన్ని అందించాలని ఎన్‌ఎంసీ స్పష్టంచేసింది. అలాగే విద్యార్థుల నుంచి క్యాపిటేషన్‌ రుసుములను వసూలు చేయరాదంది. 'విద్య.. లాభాపేక్ష కోసం కాద'న్న సూత్రాన్ని తప్పనిసరిగా పాటించాలని నిర్దేశించింది. విద్యాసంస్థ నిర్వహణ ఖర్చులు, ఇతర వ్యయాల ప్రాతిపదికన ఫీజులు వసూలు చేయాలంది.

ఇదీ చూడండి: హిజాబ్ వివాదం- రాష్ట్ర సర్కారు కీలక నిర్ణయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.