ETV Bharat / bharat

యూట్యూబ్​ చూసి పసికందును చంపిన మైనర్​ తండ్రి.. కోడి రక్తంతో.. - నవజాత శిశువు అపహరణ

యూట్యూబ్​ సాయంతో 45 రోజులు నవజాత శిశువును హతమార్చాడు ఓ మైనర్​ తండ్రి. కోడి రక్తంతో పోలీసులను తప్పుదోవ పట్టించాడు. చివరకు కటకటాలపాలయ్యాడు. ఈ దారుణం ఛత్తీస్​గఢ్​లోని దంతెవాడా జిల్లాలో వెలుగు చూసింది. మరోవైపు.. మహారాష్ట్రలోని వార్దాలో ప్రియురాలి వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడో యువకుడు.

Minor father killed innocent
యూట్యూబ్​ చూసి శిశువును చంపిన మైనర్​ తండ్రి
author img

By

Published : Jun 3, 2022, 10:22 PM IST

మేజర్​ కాకముందే వివాహం చేసుకున్న ఓ యువకుడు.. తన 45 రోజుల శిశువును చెరువులో పడేసి అత్యంత దారుణంగా హతమార్చాడు. చిన్న వయసులోనే బిడ్డకు జన్మనివ్వటంపై ఆందోళన చెందిన నిందితుడు.. యూట్యూబ్​లో చూసి ప్రణాళిక రచించాడు. కోడి రక్తంతో పోలీసులు, గ్రామస్తులను తప్పుదోవ పట్టించాడు. ఈ అమానుష సంఘటన ఛత్తీస్​గఢ్​లోని దంతెవాడా జిల్లాలో వెలుగు చూసింది.

ఇదీ జరిగింది: బారసూర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని ఉప్పెట్​ గ్రామంలో 45 రోజుల నవజాత శిశువు కనిపించటం లేదని ఫిర్యాదు నమోదైంది. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆశ్చర్యకర విషయాలను వెల్లడించారు. చిన్నారిని అతడి మైనర్​ తండ్రే హత్య చేసినట్లు తేల్చారు. చిన్న వయసులోనే తండ్రి అయ్యాననే కారణంగా ఇలా చేశాడని చెప్పారు. ఈ కేసులో పసికందు తల్లిదండ్రులు ఇద్దరూ మైనర్లే కావటం గమనార్హం. గ్రామంలో జరిగిన ఓ సామాజిక కార్యక్రమంలో వారు వివాహం చేసుకున్నారు.

పోలీసులు వివరాల ప్రకారం.. తన బిడ్డను చంపేందుకు యూట్యూబ్​ చూసి ప్రణాళిక రచించాడు నిందితుడు. తొలుత చిన్నారిని రాత్రి ఇంట్లోంచి అపహరించాడు. గ్రామ శివారులోని ఓ కల్వర్ట్​ కింద దాచి పెట్టాడు. మరుసటి రోజు చిన్నారిని సమీపంలోని చెరువులో పడేసి హత్య చేశాడు. ఆ తర్వాత పాపకు చెందిన రుమాలు, నల్లటి దారం ఇంటి సమీపంలో పడేశాడు. కోడిని కోసి వాటిపై రక్తాన్ని పోశాడు. అటవీ జంతువులు చిన్నారిని ఎత్తుకు పోయాయని నమ్మించే ప్రయత్నం చేశాడు. అప్పటివరకు అతడిపై పోలీసులు, గ్రామస్తులు అనుమానపడలేదు.

నిందితుడి మొబైల్​ ఫోన్​ సీజ్​ చేశారు పోలీసులు. ఐపీసీలోని 302 సెక్షన్​ కింద హత్య కేసు నమోదు చేశారు. ఈ కేసుపై వివరాలు వెల్లడించారు దంతెవాడా ఎస్పీ సిద్ధార్థ్​ తివారి ' మాకు లభించిన ఆధారాల ప్రకారం అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకున్నాం. చిన్నారి తన తల్లి వద్ద ఇంట్లో నిద్రించగా.. కుటుంబ సభ్యులు బయట పడుకున్నారు. రక్తంతో తడిచిన ఓ గుడ్డ కనిపించింది. శిశువును అటవీ జంతువు లాక్కెళ్లిందని గ్రామస్తులు భావించారు. లోతుగా దర్యాప్తు చేపట్టగా చిన్నారి తండ్రే హత్య చేసినట్లు తేలింది. ' అని తెలిపారు.

ప్రియురాలి వేధింపులతో యువకుడు ఆత్మహత్య
మహారాష్ట్ర, వార్దా జిల్లాలో షాకింగ్​ ఘటన వెలుగు చూసింది. మాండ్లా శివారా ప్రాంతానికి చెందిన ఓ యువకుడు తన ప్రియురాలి వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్​ లెటర్​ ప్రకారం బాధితుడి తల్లి ఫిర్యాదు మేరకు సవంగి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బాధితుడు ఆశిశ్​ భోపలేగా తెలిపారు. కృష్ణాపుర్​ తాలూకాలోని ఆర్వీ గ్రామానికి చెందిన పార్బాతా కుంభేకర్​ అనే యువతిని ఆశిశ్​ ప్రేమించాడు. పార్బాతా, ఆమె స్నేహితుడు తిలక్​ సాటోణేలు డబ్బులు ఇవ్వాలని ఆశిశ్​ను వేధింపులకు పాల్పడ్డారు. ఇటీవల రూ.2 లక్షలు ఇవ్వాలని ఒత్తిడి చేశారు. అడిగిన డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరించారు. మనస్థాపానికి గురైన ఆశిశ్​ ఇంటి సమీపంలోని చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఇదీ చూడండి: వ్యక్తిపై పెట్రోల్​ పోసి నిప్పంటించిన దుండగుడు.. లైవ్​ వీడియో

రాష్ట్రపతి పర్యటనకు ముందు ఉద్రిక్తత.. రెండు వర్గాల మధ్య ఘర్షణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.