ETV Bharat / bharat

కాలిన గాయాలతో తల్లి.. సాయానికి బాలుడి వినతి

author img

By

Published : Jun 7, 2021, 11:30 AM IST

Updated : Jun 7, 2021, 2:46 PM IST

ఒంటి నిండా కాలిన గాయాలతో ఉన్న తల్లిని కాపాడుకునేందుకు ఓ బాలుడు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. వైద్యానికయ్యే ఖర్చు అతని తలకు మించిన భారంలా మారింది. దాతలు సాయం చేసి ఆదుకోవాలని కోరుతున్నాడు.

son request to save his mother
కర్ణాటక వార్తలు

కాలిన గాయాలతో బాధపడుతోన్న తల్లిని కాపాడుకునేందుకు కర్ణాటకలో ఓ 15 ఏళ్ల బాలుడు తల్లడిల్లిపోతున్నాడు. సాయం చేయాలని వేడుకుంటున్నాడు. ఈ దయనీయ పరిస్థితి కలబుర్గిలోని బసవేశ్వర ఆస్పత్రిలో నెలకొంది.

son request to save his mother
ధనలక్ష్మి

5 నెలల క్రితం ధనలక్ష్మి అనే మహిళకు ఆమె భర్త శివలింగ స్వామి నిప్పంటించి, అనంతరం తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. తీవ్ర గాయాలైన ఆమెకు బీదర్​లోని బ్రిమ్స్​ ఆస్పత్రిలో చికిత్స అందించారు. అనంతరం మే 29న బసవేశ్వరకు తరలించారు.

రాష్ట్ర ఆరోగ్య పథకం కింద మహిళకు చికిత్స అందుతోంది. అయితే ఆమెకు రక్తహీనత కారణంగా ఆపరేషన్​కు వైద్యులు నిరాకరించారు. ఇక ఆపరేషన్​ జరిగితేనే ప్రభుత్వం నుంచి డబ్బులు అందుతాయి. ఈ నేపథ్యంలో ఏమి చేయాలో పాలుపోక ఆమె పెద్ద కుమారుడు చెన్నబసు విలపిస్తున్నాడు. ఇద్దరు పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందోనని ఆ తల్లి రోధిస్తోంది.

son request to save his mother
రోధిస్తోన్న తల్లి

ఇప్పటికే రూ.30వేల బిల్లు చెల్లించమని ఆస్పత్రి డిమాండ్ చేసింది. కాగా, రోజురోజుకూ మహిళ పరిస్థితి విషమంగా మారుతోంది. దీంతో డబ్బులు ఎక్కడినుంచి తీసుకురావాలో పాలుపోక బాలుడు సతమతవుతున్నాడు.

son request to save his mother
తల్లి చికిత్స కోసం సాయం చేయాలని బాలుడి వినతి

"అమ్మను కోల్పోతే నేనూ, నా తమ్ముడు అనాథలవుతాం" అని ఆవేదన పడుతున్నాడు చెన్నబసు. దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నాడు. అతడి ఫోన్​ నెంబర్: 9379379859

ఇదీ చూడండి: అమ్మతో ఆఖరి వీడియో కాల్... పాట పాడుతూ...

Last Updated : Jun 7, 2021, 2:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.