ETV Bharat / bharat

ఈసారీ అసంపూర్తిగానే- 19న మరోసారి రైతులతో కేంద్రం భేటీ - farmer and govt talks

9th round of talks between Centre, farmer unions today
విజ్ఞాన్ భవన్‌కు చేరుకున్న రైతు సంఘాల నేతలు
author img

By

Published : Jan 15, 2021, 11:54 AM IST

Updated : Jan 15, 2021, 5:44 PM IST

17:29 January 15

అసంపూర్తిగానే ముగిసిన చర్చలు..

నూతన వ్యవసాయ చట్టాల అంశంలో.. రైతు సంఘాలతో కేంద్ర ప్రభుత్వం జరిపిన 9వ విడత చర్చలూ అసంపూర్తిగానే ముగిశాయి. రెండు వర్గాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభన వీడలేదు. సాగు చట్టాల రద్దుకే రైతు సంఘాలు కట్టుబడి ఉండడం, కుదరదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయడంతో చర్చల్లో ఎలాంటి పరిష్కారం రాలేదు. ఈనెల 19న మరోసారి సమావేశం కావాలని ఇరువర్గాలు నిర్ణయించాయి. 

చర్చలు ప్రారంభమైన మొదట్లోనే పట్టువిడుపులతో ఉండాలని రైతు సంఘాలకు వ్యవసాయ మంత్రి తోమర్‌ విజ్ఞప్తి చేశారు. పలు డిమాండ్‌లకు అంగీకరించినా ప్రభుత్వం మొండిగా ఉందని, అహం ప్రదర్శిస్తోందని అనడం సరికాదని అన్నారు. అయితే మంత్రి విజ్ఞప్తి ఫలించలేదు. రైతులు తమ డిమాండ్‌లపై వెనక్కి తగ్గకపోవడంతో 5గంటల పాటు చర్చలు జరిగినా ఎలాంటి పరిష్కారం లభించకుండానే సమావేశం అసంపూర్తిగా ముగిసింది. 

16:56 January 15

19న మరోసారి..

కొత్త సాగు చట్టాలపై రైతులు- కేంద్రం మధ్య 9వ విడత చర్చలు ముగిశాయి. సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలని రైతులు మరోసారి స్పష్టం చేసినట్లు సమాచారం. కనీస మద్దతు ధరను చట్టబద్ధం చేయాలని డిమాండ్​ చేసినట్లు తెలుస్తోంది. అయితే రైతులు పట్టువిడుపులు ప్రదర్శించాలని కేంద్రం కోరింది. ఈ నేపథ్యంలో ఈ నెల 19న మరోసారి భేటీ కావాలని నిర్ణయించింది కేంద్రం.

16:11 January 15

నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని దిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తోన్న రైతు సంఘాలు, కేంద్ర ప్రభుత్వం మధ్య 9వ విడత చర్చలు కొనసాగుతున్నాయి. కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌, ఆహార శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌, పంజాబ్‌కు చెందిన మరో కేంద్ర మంత్రి సోమ్‌ ప్రకాశ్ దిల్లీ విజ్ఞాన్‌ భవన్‌లో రైతులతో చర్చలు జరుపుతున్నారు. ఈ నెల 8న జరిగిన 8వ విడత చర్చల్లో ఎలాంటి పురోగతి రాని నేపథ్యంలో ఇవాళ మరోసారి సమావేశమయ్యారు. 

ఈ సందర్భంగా ఒకే అంశానికి కట్టుబడి ఉండకుండా పట్టువిడుపులతో ఉండాలని రైతు సంఘాలకు వ్యవసాయ మంత్రి తోమర్‌ విజ్ఞప్తి చేశారు. పలు డిమాండ్‌లకు అంగీకరించినా ప్రభుత్వం మొండిగా ఉందని, అహం ప్రదర్శిస్తోందని అనడం సరికాదని అన్నారు. కేంద్రం, రైతు సంఘాల మధ్య ఇప్పటి వరకు జరిగిన చర్చల్లో విద్యుత్‌ బిల్లు, పంట వ్యర్ధాలను కాలిస్తే శిక్షల తగ్గింపు అంశంపై మాత్రమే ఏకాభిప్రాయం కుదిరింది. అయితే వ్యవసాయ చట్టాలను పూర్తిగా రద్దు చేయాలని, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని కూడా రైతు సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ అంశంపైనే రెండు వర్గాల మధ్య ప్రతిష్టంభన ఏర్పడింది. రైతులతో చర్చల కోసం సుప్రీంకోర్టు ఇప్పటికే నలుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేయగా.. అందులో సభ్యుడైన భూపీంద్ర సింగ్‌ మాన్‌ వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. 

15:52 January 15

రైతులు- కేంద్రం మధ్య జరుగుతోన్న చర్చలు ఓ కొలిక్కిరాలేదని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్​ అన్నారు. భోజన విరామం తర్వాత ఎమ్​ఎస్​పీ చట్టం గురించి చర్చిస్తామని తెలిపారు. 

14:56 January 15

సాగు చట్టాలపై రైతులు, ప్రభుత్వానికి మధ్య జరుగుతోన్న చర్చకు కాసేపు భోజన విరామం ఇచ్చారు. అనంతరం చర్చలు తిరిగి ప్రారంభించనున్నారు.

12:20 January 15

  • రైతులు, కేంద్ర ప్రభుత్వం మధ్య చర్చలు ప్రారంభం
  • సాగు చట్టాలపై రైతులు, కేంద్ర ప్రభుత్వం మధ్య తొమ్మిదో విడత చర్చలు
  • దిల్లీ: రైతుల తరపున చర్చల్లో పాల్గొన్న 41 మంది ప్రతినిధులు
  • సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలని పట్టుబడుతున్న రైతులు
  • వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకునేది లేదంటున్న కేంద్రం
  • అభ్యంతరం ఉన్న అంశాలపై చట్టంలో మార్పులకు సిద్ధమన్న కేంద్రం
  • కనీస మద్దతు ధర చట్టబద్ధం చేయాలని డిమాండ్ చేస్తున్న రైతులు

11:39 January 15

విజ్ఞాన్ భవన్‌కు చేరుకున్న రైతు సంఘాల నేతలు

  • Delhi: Farmer leaders reach Vigyan Bhawan to hold ninth rounds of talks with the Central government over the new farm laws.

    "Govt needs to devise a plan to scrap the three laws and give legal guarantee for MSP," says BKU Spokesperson Rakesh Tikait. pic.twitter.com/U5vBFzf1yB

    — ANI (@ANI) January 15, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

నూతన వ్యవసాయ చట్టాలపై చర్చించేందుకు రైతు సంఘాల నాయకులు దిల్లీలోని విజ్ఞాన్ భవన్‌కు చేరుకున్నారు. మరికాసేపట్లో రైతు సంఘాలతో కేంద్ర ప్రభుత్వం 9వ విడత చర్చలు జరపనుంది.  ఈ నెల 8న జరిగిన 8వ విడత చర్చల్లో ఎలాంటి పురోగతి రాని నేపథ్యంలో ఇవాళ మరోసారి చర్చలు జరపనున్నారు. సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలని రైతులు పట్టుబడుతున్నారు. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకునేది లేదని కేంద్రం చెబుతోంది.  

Last Updated : Jan 15, 2021, 5:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.