ETV Bharat / bharat

Farmers protest end: సుదీర్ఘ నిరసనలకు తెర- ఇళ్లకు రైతులు - Farmer Protest in India

Farmers protest end: దిల్లీ సరిహద్దుల్లో నిరసనలు చేస్తున్న రైతులు ఎట్టకేలకు ఇళ్లకు వెళ్లనున్నారు. ఏడాదికిపైగా చేస్తున్న నిరసనలకు ముగింపు పలికినట్లు సంయుక్త కిసాన్​ మోర్చా స్పష్టం చేసింది. ఈ క్రమంలో సింఘూ సరిహద్దులోని రైతులు.. తమ తాత్కాలిక నివాసాలను (టెంట్లు) తొలగిస్తున్నారు.

Farmers prFarmers start removing tentsotests
రైతు నిరసనలు, farmers protest, farmers removing tents
author img

By

Published : Dec 9, 2021, 2:32 PM IST

Updated : Dec 9, 2021, 3:12 PM IST

Farmers protest end: దిల్లీ సరిహద్దుల్లో నిరసనలు చేస్తున్న రైతులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ హామీ అనంతరం.. నిరసనలకు ముగింపు పలికినట్లు సంయుక్త కిసాన్​ మోర్చా ప్రకటించింది. ఈ నేపథ్యంలో రైతులు.. దిల్లీ- హరియాణా సరిహద్దుల్లో తమ ఆందోళనల కోసం ఏర్పరుచుకున్న టెంట్లు, తాత్కాలిక శిబిరాలను తీసివేస్తున్నారు.

Farmers protest end
టెంట్లు తొలగిస్తున్న రైతులు

కేంద్రం నుంచి లేఖ..

నిరసనలు చేస్తున్న రైతులకు కేంద్రం నుంచి ఓ లేఖ అందింది. కనీస మద్దతు ధరపై కమిటీ ఏర్పాటు సహా రైతులపై కేసులను తక్షణమే ఎత్తివేస్తున్నట్లు ఆ లేఖలో కేంద్రం స్పష్టం చేసింది.

సాగు చట్టాలకు వ్యతిరేకంగా సాగిన ఆందోళనల సందర్భంగా.. మరణించిన రైతుల కుటుంబాలకు పరిహారం ఇచ్చేందుకు ఉత్తరప్రదేశ్‌, హరియాణా ప్రభుత్వాలు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపాయి. ఈ విషయాన్నీ లేఖలో ప్రస్తావించింది కేంద్రం.

Samyukt Kisan Morcha: ఈ నేపథ్యంలోనే.. సంయుక్త కిసాన్​ మోర్చా సమావేశమై.. ప్రభుత్వ ప్రతిపాదనలపై చర్చించి, తుది నిర్ణయం తీసుకుంది.

హామీలు నెరవేర్చకుంటే..

తమ ఆందోళనలను విరమిస్తున్నట్లు స్పష్టం చేసిన రైతు సంఘం నేత గుర్నాం సింగ్​.. జనవరి 15న సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చకుంటే తమ నిరసనలు మళ్లీ కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.

  • డిసెంబర్​ 11న విజయ యాత్ర చేసుకుంటూ.. రైతులు ఇళ్లకు వెళ్తారని రైతు సంఘం నేత బల్బీర్​ సింగ్​ రాజేవాల్​ వెల్లడించారు.
  • ఇది రైతులు సాధించిన చారిత్రక విజయం అని, తమ నిరసనల సందర్భంగా ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలకు క్షమాపణలు చెప్పారు రైతు నాయకుడు శివ్​ కుమార్​ కక్కా.

ఏడాదికిపైగా నిరసనలు..

Farmer Protest in India: తమ డిమాండ్లను నెరవేర్చాలని రైతులు.. దిల్లీ సరిహద్దుల్లో ఏడాదికిపైగా ఆందోళనలు చేస్తున్నారు. నూతన సాగు చట్టాలను రద్దు చేయాలన్న రైతుల డిమాండ్​ను నెరవేరుస్తూ ప్రభుత్వం ఇటీవల ఆ చట్టాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయినా కనీస మద్దతు ధర(ఎంఎస్​పీ) సహా ఇతర డిమాండ్లు నెరవేర్చాలని చెబుతూ నిరసనలు కొనసాగిస్తూ వచ్చారు. వీటిపైనా సానుకూలంగా స్పందిస్తామని, ఆందోళన విరమించాలని రైతులను ప్రభుత్వం కోరింది.

ఇవీ చూడండి:

Farmers Movement: రైతుల ఉద్యమంలో కీలక నాయకులు వీరే..

ఫలించిన అన్నదాతల పోరాటం.. సాగు చట్టాలు రద్దు

Farm Laws: సాగు చట్టాల రద్దుకు రాష్ట్రపతి ఆమోదం

Last Updated : Dec 9, 2021, 3:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.