ETV Bharat / bharat

రైతులకు గుడ్​న్యూస్- స్మార్ట్​ఫోన్​ కొనేందుకు ప్రభుత్వం సాయం - స్మార్ట్​ఫోన్​ కొనుగోలుకు రైతులకు రూ. 1500 ఆర్థిక సాయం

రైతులను డిజిటలీటకరణ వైపు అడుగులు వేయించేలా గుజరాత్​ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్మార్ట్​ఫోన్​ను కొనుగోలు చేసే రైతులకు ఆర్థిక సాయాన్ని అందించాలని నిర్ణయించింది. స్మార్ట్​ఫోన్​ ఖరీదులో 10 శాతాన్ని అందించేందుకు ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

government aid to purchase smartphones
రైతులకు స్మార్ట్​ఫోన్​
author img

By

Published : Nov 21, 2021, 3:47 PM IST

సాంకేతికత కొంత పుత్తలు తొక్కుకున్న నేపథ్యంలో రైతులను కూడా అందులో భాగం చేయాలని నిర్ణయించింది గుజరాత్​ ప్రభుత్వం. ఇందుకుగాను స్మార్ట్​ఫోన్​ కొనుగోలు సాయం కింద అక్కడి అన్నదాతలకు సుమారు రూ. 1,500 వరకు ఆర్థిక సాయాన్ని అందించనుంది. ఈ మేరకు గుజరాత్​ వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. డిజిటల్ సేవలను సద్వినియోగం చేసుకుని, వ్యవసాయ సంబంధిత ఆదాయాన్ని మరింత పెంచడానికి ఈ పథకం ఉపయోగపడుతుందని తెలిపింది.

భూమి కలిగిన రైతులు ఎవరైనా.. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పింది గుజరాత్ వ్యవసాయ శాఖ. మొబైల్​ ఫోన్​ కొనుగోలు చేసే మొత్తం ఖర్చులో రూ.1,500కు మించకుండా 10 శాతం వరకు ఇవ్వాలని నిర్ణయించినట్లు స్పష్టం చేసింది. ఈ మొత్తం పొందేందుకు ఐ-కేదుత్​ పోర్టల్​లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. సెల్​ఫోన్​ సంబంధించిన ఉపకరణాల కొనుగోలుకు ఈ పథకం వర్తించదని తెలిపిన ప్రభుత్వం... భూమి కలిగిన ప్రతి ఒక్కరూ దీనిని అర్హులేనని స్పష్టం చేసింది.

రైతుల వద్ద స్మార్ట్​ఫోన్​ ఉండడం ద్వారా వాతావరణ సమాచారం, పంటను చీడల నుంచి కాపాడుకోవడం, ప్రభుత్వానికి సంబంధించిన వివిధ పథకాల గురించిన సమాచారం తెలుసుకోవచ్చని చెప్పింది. ఈ పథకానికి రైతుల దరఖాస్తు ఆమోదం పొందిన తరువాత.. లబ్ధిదారుడు ఫోన్ కొనుగోలు బిల్లు, మొబైల్ ఐఎంఈఐ నంబర్​, క్యాన్సిల్​ చెక్కును వంటి వాటి కాపీని ప్రభుత్వానికి అందించాలని గుజరాత్​ వ్యవసాయ శాఖ తెలిపింది.

ఇదీ చూడండి: అడవుల్లో దూసుకెళ్లే 'ఈ-బైక్​'.. సోలార్ ఎనర్జీతో ఛార్జింగ్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.