ETV Bharat / bharat

వేసవిలోనూ 'రైతు పోరు'- ట్రాక్టర్లలోనే కూలర్లు

నూతన సాగు చట్టాలపై ఉద్యమిస్తోన్న రైతులు వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. రానున్న వేసవి కాలాన్ని ఎదుర్కొనేందుకు టిక్రి సరిహద్దు వద్ద రైతులు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తాగు నీరు సహా ఎండ వేడిని తట్టుకునేందుకు ఫ్రిడ్జ్​లు, కూలర్లను సిద్ధం చేస్తున్నారు.

Farmers
వేసవిని ఎదుర్కొనేందుకు రైతుల పక్కా ఏర్పాట్లు
author img

By

Published : Mar 4, 2021, 2:08 PM IST

Updated : Mar 4, 2021, 2:22 PM IST

దిల్లీ సరిహద్దులో రైతుల నిరసన ఉద్ధృతంగా సాగుతోంది. ప్రభుత్వం దిగి వచ్చి సాగు చట్టాలను వెనక్కి తీసుకోకపోతే దీర్ఘకాలం ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నామని రైతులు ఇప్పటికే తేల్చిచెప్పారు. ఇందుకు అనుగుణంగా సర్వం సిద్ధం చేస్తున్నారు అన్నదాతలు. వేసవి కాలంలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా ట్రాక్టర్​ ట్రాలీల్లో కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు. రాత్రి వేళలో దోమలు రాకుండా ఉండేందుకు ట్రాలీ చుట్టూ తెరలు​ కడుతున్నారు. ఫ్యాన్​లు, వాటర్​ ఫిల్టర్​లు ఏర్పాటు చేస్తున్నారు.

Farmers
రైతుల ఏర్పాట్లు
Farmers
తాగు నీరు ఏర్పాటు
Farmers
ట్రాక్టర్​ ట్రాలీలో లైట్​, ఫ్యాన్​
Farmers
సరిహద్దు వద్దే తిండి, నిద్ర
Farmers
ట్రాక్టర్​లోనే ఫ్రిడ్జ్​
Farmers
దోమల కోసం ఆల్​ఔట్

మరోవైపు టిక్రి సరిహద్దులో నిరనన చేస్తోన్న రైతులు ఆ ప్రాంతంలో నీరు కోసం బోరును తవ్వారు. ఫ్యాన్​లు సహా సకల సౌకర్యాలను సిద్ధం చేసుకున్నారు.

"రానున్న వేసవి కాలాన్ని ఎదుర్కొనేందుకు నీటి పంపు, పెద్ద ఫ్రిడ్జ్​, ఫ్యాన్​లు, గుడిసెలను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం"

- రైతు

గత ఏడాది నవంబర్​ నుంచి రైతులు.. నూతన సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలని ఉద్యమిస్తున్నారు.

Last Updated : Mar 4, 2021, 2:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.