రైతుల కార్యచరణ ఇదే..
నూతన వ్యవసాయ చట్టాల్లో సవరణల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సవరణలను తిరస్కరిస్తున్నట్లు దిల్లీలో ఆందోళన చేస్తున్న రైతు సంఘాలు స్పష్టం చేశాయి. కేంద్ర ప్రతిపాదనలపై చర్చించిన రైతు సంఘాల నేతలు వాటిని ఏకగ్రీవంగా తిరస్కరిస్తున్నట్లు తెలిపాయి. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలను కొనసాగించాలని నిర్ణయించాయి.
ఈ నెల 14న దేశవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శన నిర్వహిస్తామని రైతు సంఘాల నేతలు తెలిపారు. ఈ నెల 12 వరకు దిల్లీ-జైపుర్, దిల్లీ-ఆగ్రా జాతీయ రహదారిని దిగ్బంధిస్తామని ప్రకటించారు.
- 12వ తేదీన దేశవ్యాప్తంగా టోల్ ప్లాజాల దిగ్బంధం: రైతు సంఘాలు
- 12వ తేదీ తర్వాత భాజపా నేతలను ఘెరావ్ చేస్తాం: రైతు సంఘాలు
- 14న దేశవ్యాప్త ఆందోళనలు చేపడతాం: రైతు సంఘాలు
- వ్యవసాయ చట్టాలు రద్దు చేసే వరకు ఆందోళనలు కొనసాగిస్తాం: రైతు సంఘాలు
- ఇతర రాష్ట్రాల రైతులు కూడా దిల్లీలో ఆందోళనల్లో పాల్గొనాలి: రైతు సంఘాలు