ETV Bharat / bharat

'దిల్లీ ఘర్షణల్లో 109మంది పోలీసులకు గాయాలు'

author img

By

Published : Jan 26, 2021, 10:48 PM IST

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్​ ర్యాలీలో ఘర్షణ చెలరేగి.. 109 మంది పోలీస్ సిబ్బంది గాయపడ్డారని దిల్లీ పోలీసులు తెలిపారు. ఆందోళనకారుల దాడి నుంచి తప్పించుకునే క్రమంలో గాయాలైనట్లు వివరించారు. వీరిలో 30మంది తీవ్రంగా గాయపడినట్టు పేర్కొన్నారు. రైతులు ర్యాలీకి ముందు చెప్పిన నిబంధనలను పూర్తిగా ఉల్లఘించి హింస, విధ్వంసానికి పాల్పడ్డారన్నారు.

Farmers broke pre-decided conditions for parade, many personnel injured: Delhi Police
ట్రాక్టర్ ర్యాలీ- 109 మంది పోలీస్​ సిబ్బందికి గాయాలు'

హింసాత్మకంగా మారిన రైతుల ట్రాక్టర్​ ర్యాలీలో.. 109మంది పోలీస్​ సిబ్బంది గాయపడినట్లు దిల్లీ పోలీస్​ అధికారి ఈష్ సింఘాల్ వెల్లడించారు. నిర్ణీత సమయం కంటే ముందే ట్రాక్టర్​ ర్యాలీ చేపట్టారని వివరించారు. రైతులు నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించి హింస, విధ్వంసానికి పాల్పడ్డారన్నారు. ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం జరిగిందని వివరించారు.

30మందికి సీరియస్..

మోహన్​ గార్డెన్ పోలీస్​ స్టేషన్​లో పనిచేసే 30 మంది పోలీస్ సిబ్బంది.. ఘర్షణల్లో తీవ్రంగా గాయపడినట్లు దిల్లీ పోలీస్ అధికారులు తెలిపారు. ద్వారకాలో జరిగిన ఈ ఘటనపై మూడు ఎఫ్​ఐఆర్​లు నమోదు చేసినట్లు వివరించారు.

కేసులు నమోదు..

ర్యాలీలో పోలీసులపై దాడికి పాల్పడ్డ వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని దిల్లీ జాయింట్ పోలీస్​ ​కమిషనర్ అలోక్​ కుమార్ తెలిపారు. తూర్పు దిల్లీలో 8 బస్సులు, 17 ప్రైవేటు వాహనాలను రైతులు ధ్వంసం చేశారని వివరించారు. ఇప్పటివరకు 4 కేసులు నమోదు చేశామన్నారు.

దిల్లీ ఘటనపై సీజేఐకు లేఖ

రైతుల ట్రాక్టర్ ర్యాలీలు, 6 హింసాత్మక ఘటనలపై సీజేఐ జస్టిస్ ఎస్ఏ బొబ్డేకు లేఖ రాశారు న్యాయ విద్యార్థి ఆశిష్‌రాయ్. ఎర్రకోటపై వేరే జెండా ఎగురవేయటాన్ని సుమోటోగా తీసుకోవాలన్నారు. రైతుల ర్యాలీలో అసాంఘిక శక్తులు చొరబడ్డాయని లేఖలో పేర్కొన్నారు. ప్రజల ఆస్తికి తీవ్ర నష్టం వాటిల్లిందని వివరించారు. ఈ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు కమిటీ ఏర్పాటు చేయాలని సీజేఐను కోరారు.

ఇదీ చదవండి : 'దిల్లీలో హింస బాధాకరం.. కేంద్రానిదే తప్పు'

దద్దరిల్లిన దిల్లీ- ఎర్రకోటపై 'రైతు' జెండా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.