ETV Bharat / bharat

'ప్రాణాలు పోతున్నా.. మడమ తిప్పని రైతన్నలు' - రైతుల మరణాలుపై రాహుల్ ట్వీట్లు

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమంలో.. ఎంతో మంది తమ ప్రాణాలు కోల్పోతున్నా రైతులు మడమ తిప్పకుండా పోరాడుతున్నారని కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. తమ ఉద్యమానికి వారంతా కట్టుబడి ఉన్నారని చెప్పారు.

rahul gandhi tweet
రాహుల్​ గాంధీ ట్వీట్​
author img

By

Published : Jun 9, 2021, 1:55 PM IST

నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులకు మద్దతుగా కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ మరోసారి తన గళాన్ని వినిపించారు. నిరసనల వేదిక వద్ద ఎంతో మంది తమ ప్రాణాలు కోల్పోతున్నా.. రైతులు తమ ఉద్యమానికి కట్టుబడి ఉన్నారని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. తన ట్వీట్​కు #500DeathsAtFarmersProtest​ అనే హ్యాష్​ ట్యాగ్​ను జోడించారు.

"తమ పొలాలను, దేశాన్ని కాపాడటానికి రైతులు ఒక్కొక్కరుగా నేలరాలుతున్నారు. కానీ వాళ్లు భయపడటం లేదు. తమ ఉద్యమానికి కట్టుబడి ఉన్నారు."

- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత

గతేడాది నవంబర్ 26 నుంచి కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా.. పంజాబ్​, హరియాణా, ఉత్తర్​ప్రదేశ్​ ప్రాంతాల రైతులు దిల్లీ సరిహద్దులో ఉద్యమిస్తున్నారు. గత ఆరు నెలల్లో 500 మందికి రైతులు ఈ ఉద్యమంలో కన్నుమూశారు. నూతన సాగు చట్టాలను ఉపసంహరించుకోవాలని, పంటలకు కనీస మద్దతు ధర అందించాలని వారు డిమాండ్​ చేస్తున్నారు.

ఇదీ చూడండి: Petrol Hike: 'జూన్​ 11న దేశవ్యాప్తంగా నిరసనలు'

ఇదీ చూడండి: 'జులైలోనే పార్లమెంటు​ సమావేశాలు!'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.