ETV Bharat / bharat

'రైతు ఉద్యమాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ ఆపేదిలేదు'

author img

By

Published : Mar 25, 2021, 5:40 AM IST

Updated : Mar 25, 2021, 7:05 AM IST

సాగు చట్టాలను నిరసిస్తూ.. అన్నదాతలు చేస్తున్న నిరసనలను కొనసాగిస్తామని భారతీయ కిసాన్​ యూనియన్​(బీకేయూ) నాయకుడు రాకేశ్​ టికాయత్​ తెలిపారు. వేసవి కాలంలో రైతులు వెనక్కి వెళతారని కేంద్రం భావిస్తోందన్న ఆయన.. అలాంటి ఆలోచనల్ని తిప్పికొడతామన్నారు. మరోవైపు.. ఈ నెల 26న తలపెట్టిన భారత్​ బంద్​ను విజయవంతం చేయాలని కిసాన్​ సంయుక్త మోర్చా పిలుపునిచ్చింది.

Farmers agitation will continue: Rakesh Tikait
'రైతు ఉద్యమాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ ఆపేదిలేదు'

కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్నదాతల నిరసనలు కొనసాగుతాయని భారతీయ కిసాన్​ యూనియన్(బీకేయూ)​ నాయకుడు రాకేశ్​ టికాయత్​ అన్నారు. ప్రభుత్వం.. సాగు చట్టాలను వెనక్కి తీసుకునేంత వరకూ తమ ఉద్యమాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ ఆపేదిలేదని హరియాణాలో జరిగిన 'మహా పంచాయత్'లో పేర్కొన్నారు. అంతేకాకుండా కనీస మద్దతు ధర(ఎంఎస్​పీ)పై చట్టపరమైన హామీ ఇవ్వాలని డిమాండ్​ చేశారు.

అన్నదాతల ఉద్యమంలో భాగస్వాములైన ఆ హరియాణా రైతులకు, ఖాప్స్​ వర్గం వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు టికాయత్​. ఉద్యమంలో భాగంగా అవసరమైనప్పుడు దిల్లీకి వెళ్లేందుకు సంసిద్ధంగా ఉండాలని సూచించారు.

'రైతులపై కేసులకు భయపడేది లేదు'

దిల్లీలో జనవరి 26న జరిగిన ఘటన అనంతరం.. అనేక మంది రైతులపై కేసులు నమోదయ్యాయని టికాయత్​ అన్నారు. ఇలాంటి వాటికి తాము భయపడమన్న ఆయన.. ఎన్నాళ్లైనా ఉద్యమాన్ని కొనసాగిస్తామన్నారు. కేంద్రం చట్టాల్ని వెనక్కి తీసుకునేవరకూ రైతులు ఎక్కడికీ వెళ్లరని స్పష్టం చేశారు.

"వేసవి కాలంలో రైతులు వెనక్కి వెళ్తున్నారని ప్రభుత్వం భావిస్తోంది. అంతకుముందు శీతాకాలంలోనూ ఇలాగే అభిప్రాయపడింది. కానీ వారి ఆలోచనల్ని తిప్పికొడుతూ.. ఎముకలు కొరికే చలిలోనూ ఉద్యమించాం. కేంద్రం దిగిరాకపోతే నవంబర్​ లేదా డిసెంబర్​ వరకూ ఆందోళనలు కొనసాగిస్తాం. అందుకు తగిన ఏర్పాట్లు చేసుకున్నాం."

- రాకేశ్​ టికాయత్​, బీకేయూ నాయకుడు

అన్నదాతలకు మద్దతుగా నిలిచిన కొందరు.. ప్రభుత్వ సంస్థల నుంచి వేధింపులు ఎదుర్కొంటున్నారని టికాయత్​ ఆరోపించారు. నూతన సాగు చట్టాలు.. రైతులకు అనుకూలంగా లేవన్న ఆయన.. ఈ చట్టాలు అమలు చేసి కర్షకుల నుంచి భూమిని లాక్కోవడమే లక్ష్యంగా పెట్టుకుందన్నారు.

భారత్​ బంద్​ను జయప్రదం చేయండి: కిసాన్​ మోర్చా

కేంద్ర ప్రభుత్వాన్ని నిరసిస్తూ రైతు సంఘాలకు మద్దతుగా ఈ నెల 26న(శుక్రవారం) భారత్​ బంద్​ను విజయవంతం చేయాలని కిసాన్​ సంయుక్త కిసాన్​ మోర్చా(ఎస్​కేఎం) దేశ ప్రజలను కోరింది. గత నాలుగు నెలలుగా దిల్లీ సరిహద్దుల్లో నిరసన తెలుపుతున్న రైతుల డిమాండ్లను ప్రభుత్వం పూర్తిగా ఖండిస్తోందని ఎస్​కేఎమ్​ తెలిపింది.

మార్చి 26న దేశవ్యాప్త బంద్​కు పిలుపునిచ్చింది ఎస్​కేఎం. ఆ రోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రోడ్డు, రైలు రవాణా సహా.. మార్కెట్లన్నీ మూతపడనున్నాయి. ఎన్నికలు జరగబోయే ప్రదేశాల్లో బంద్​కు మినహాయింపు ఉంటుంది.

ఇదీ చదవండి: వివాదాస్పద 'దిల్లీ' బిల్లుకు పార్లమెంట్ ఆమోదం

Last Updated : Mar 25, 2021, 7:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.