ETV Bharat / bharat

రూ. లక్షన్నర కరెంట్​ బిల్లు.. రైతు ఆత్మహత్య - ఉత్తర్​ప్రదేశ్​​లో రైతు ఆత్మహత్య

ఉత్తర్​ప్రదేశ్​​లోని ఓ రైతు ఇంటికి రూ. 1500 బిల్లు వస్తే.. రూ.1,50,000 అని తప్పుగా వేశారు విద్యుత్​ శాఖ అధికారులు. అంత డబ్బు కట్టలేనని చెప్పినందుకు ఆ రైతును కొట్టారు. తీవ్ర మనస్తాపంతో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.

Farmer hangs himself over c's Aligarh
రూ. లక్షన్నర కరెంట్​ బిల్లు.. రైతు ఆత్మహత్య
author img

By

Published : Feb 14, 2021, 6:41 PM IST

ఇంటి కరెంట్​ బిల్లు రూ.1500 వస్తే.. పొరపాటుగా రూ.1,50,000 అని వేశారు విద్యుత్ శాఖ అధికారులు. బిల్లు కట్టలేనని చెప్పిన ఆ రైతును కుటుంబ సభ్యుల ముందే కొట్టారు. మనస్తాపం చెందిన ఆ రైతు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని అత్రౌలీ తెహ్​సిల్​లో శనివారం జరిగింది.

సునైరా గ్రామానికి చెందిన ఆ రైతు పేరు రామ్​జీ లాల్. అతనికి ఇంటి విద్యుత్​ బిల్లు రూ.1,50,000 వచ్చింది. అయితే తనకు అంత బిల్లు రాలేదని, ఆ డబ్బు కట్టే స్థోమత తన దగ్గరలేదని విద్యుత్ శాఖ అధికారులకు విన్నవించుకున్నాడు. అయితే, ఆయన అభ్యర్థనను పక్కనబెట్టి.. కుటుంబ సభ్యుల ముందే కొట్టారు. మనస్థాపంతో రామ్​జీ లాల్​ బలవన్మరణానికి పాల్పడ్డాడు.

రైతు మృతికి కారణమైన విద్యుత్​ శాఖ అధికారులను వెంటనే అరెస్టు చేయాలని మృతదేహంతో విద్యుత్​ కార్యాలయం ముందు ధర్నా చేశారు బాధితుడి బంధువులు. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు.

బిల్లు రూ. 1500 వస్తే విద్యుత్​ శాఖ అధికారులే తప్పుగా వేశారని మృతుడి మేనల్లుడు రామ్​చరణ్​ తెలిపాడు. పొరపాటుగా పడిన బిల్లును మార్చాలని విద్యుత్​ శాఖ అధికారుల చుట్టూ రామ్​జీ లాల్​ తిరిగాడని అయినా వాళ్లు పట్టించుకోలేదని వాపోయాడు.

ఇదీ చూడండి: థన్‌బర్గ్‌ టూల్‌కిట్‌ కేసులో పోలీసు కస్టడీకి దిశ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.