ETV Bharat / bharat

వజ్రం రూపంలో రైతును వరించిన అదృష్టం

ఓ రైతుకు కాసుల పంట పండింది. రెండేళ్ల శ్రమకు ఫలితం దక్కింది. తన వ్యవసాయ భూమిలో సుమారు రూ.30 లక్షల విలువ చేసే వజ్రం దొరికింది(farmer found diamond). మధ్యప్రదేశ్​ పన్నా జిల్లాలో జరిగింది ఈ సంఘటన.

diamond
వజ్రం రూపంలో రైతును వరించిన అదృష్టం
author img

By

Published : Aug 28, 2021, 1:13 PM IST

రైతుకు దొరికిన వజ్రం

భూమినే నమ్ముకున్న ఓ రైతును అదృష్టం వరించింది. తన పొలంలో సుమారు రూ.30 లక్షల విలువ చేసే వజ్రం దొరికింది(farmer found diamond). ఈ సంఘటన మధ్యప్రదేశ్​ పన్నా జిల్లాలో జరిగింది(diamond found in madhya pradesh).

జిల్లాలోని జరువాపుర్​ గ్రామానికి చెందిన ప్రకాశ్​ ముజుందార్​ అనే రైతు.. తన పొలంలో వజ్రాలు దొరుకుతాయని తెలుసుకుని ముగ్గురు స్నేహితులతో కలిసి తవ్వకాలు చేపట్టాడు. వారి రెండేళ్ల శ్రమకు తగిన ఫలితం దక్కింది. రూ.30 లక్షల విలువైన వజ్రం దొరికింది. దానిని ప్రభుత్వ జిల్లా వజ్రాల కార్యాలయంలో డిపాజిట్​ చేశాడు ప్రకాశ్​. వేలం ద్వారా(diamond action) వచ్చే డబ్బును నలుగురూ సమానంగా పంచుకుని, వాటిని పిల్లల చదువు కోసం ఖర్చు చేయనున్నట్లు చెప్పారు.

diamond
వజ్రం చూపిస్తున్న రైతు ప్రకాశ్​ ముజుందార్​

గత ఏడాది మూడు వజ్రాలు..

గత ఏడాది సైతం తనకు 7.44 క్యారెట్లు ఒకటి, 2.5 క్యారెట్ల డైమండ్లు రెండు దొరికినట్లు తెలిపారు ప్రకాశ్​.

12.5 శాతం వాటా

సొంత భూమిలో దొరికే వజ్రాలు, ఇతర విలువైన వస్తువులకు ప్రభుత్వం 12.50 శాతం వాటా ఇస్తుందని అధికార వర్గాలు తెలిపాయి. అయితే.. వస్తువు మొత్తం తనకే చెందుతుందని ఆ వ్యక్తి వాదిస్తే.. కేసు కోర్టుకు వెళుతుందని.. తన సొంత భూమిలోనే దొరికినట్లు నిరూపిస్తే.. కోర్టు అతనికే చెందుతుందని తీర్పు ఇచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. మరోవైపు.. దొరికిన వస్తువులను ప్రభుత్వానికి అప్పగించకుండా దాచే ప్రయత్నం చేస్తే అలాంటి వారిపై క్రిమినల్​ కేసు నమోదవుతుందని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: diamond: పుడమి పుత్రుడు.. ఒక్కరోజులోనే కోటీశ్వరుడయ్యాడు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.