ETV Bharat / bharat

Farm Laws Repeal: తోమర్​ వ్యాఖ్యలపై మండిపడ్డ కాంగ్రెస్ - సాగు చట్టాలు

Farm Laws Repeal: అసెంబ్లీ ఎన్నికల తర్వాత కుట్ర అమలు చేస్తారేమో అని కేంద్రంపై ఆరోపణలు చేసింది కాంగ్రెస్. సాగు చట్టాలను మళ్లీ తీసుకొస్తారని అనుమానం వ్యక్తం చేసింది. నాగ్‌పుర్‌లో శుక్రవారం జరిగిన అగ్రో విజన్‌ ఎక్స్‌పో కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ వ్యాఖ్యల అనంతరం కాంగ్రెస్​ మండిపాటుకు ప్రాధాన్యం ఏర్పడింది.

rahul gandhi, thomar
రాహుల్ గాంధీ, తోమర్
author img

By

Published : Dec 26, 2021, 5:58 AM IST

Updated : Dec 26, 2021, 9:21 AM IST

Farm Laws Repeal: కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర స్థాయిలో స్పందించింది. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల తర్వాత 'సాగు చట్టాలను మళ్లీ తీసుకొచ్చే కుట్రను భాజపా నేతలు అమలు చేస్తారేమోన'నే సందేహాన్ని వ్యక్తం చేసింది. 'సాగు చట్టాలపై ముందడుగు వేస్తామంటూ వ్యవసాయ మంత్రి చేసిన వ్యాఖ్యలు ప్రధాని మోదీ క్షమాపణలను అవమానించేలా ఉన్నాయి. ఇది గర్హణీయం' అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు.

Congress on Narendra Singh Tomar Statement:

'రైతు వ్యతిరేక చర్యలు తీసుకున్నట్లయితే అన్నదాతలు మళ్లీ సత్యాగ్రహం ప్రారంభిస్తార'ని రాహుల్ గాంధీ హెచ్చరించారు. సాగు చట్టాలను మళ్లీ తీసుకురావాలనే కుట్ర తోమర్‌ వ్యాఖ్యలతో బహిర్గతమైందని కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సుర్జేవాలా మండిపడ్డారు. 'ప్రధాని మోదీ, భాజపా, ఆర్​ఎస్​ఎస్​ సంయుక్త పన్నాగాన్ని మేం ముందే ఊహించాం' అని పేర్కొన్నారు. ఈ కుట్రను నిలువరించాలంటే ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌ తదితర రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో భాజపాను ఓడించాలని రైతులకు, ప్రజలకు సుర్జేవాలా విజ్ఞప్తి చేశారు.

Farm Laws News: నాగ్‌పుర్‌లో శుక్రవారం జరిగిన అగ్రో విజన్‌ ఎక్స్‌పో కార్యక్రమంలో నరేంద్ర సింగ్‌ తోమర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "స్వాతంత్ర్యం వచ్చిన 70ఏళ్ల తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో అతిపెద్ద సంస్కరణ జరిగింది. వ్యవసాయానికి సంబంధించిన చట్టాలను సవరించి కొత్త చట్టాలను తీసుకొచ్చాం. కానీ కొందరికి(విపక్షాలను ఉద్దేశిస్తూ) ఈ సంస్కరణలు నచ్చలేదు. అందుకే నల్ల చట్టాలుగా ప్రచారం చేసి వాటిని రద్దు చేయించారు. కానీ ప్రభుత్వం ఏం అసంతృప్తి చెందడం లేదు. మేం ఒక అడుగు వెనక్కి వేశాం. కానీ తప్పకుండా మళ్లీ ముందడుగు వేస్తాం. ఎందుకంటే రైతులే ఈ దేశానికి వెన్నెముక" అని అన్నారు.

తోమర్ వివరణ

తన వ్యాఖ్యలపై వివాదం చెలరేగిన నేపథ్యంలో వివరణ ఇచ్చారు మంత్రి తోమర్. సాగు చట్టాలను సవరించి మళ్లీ తీసుకొచ్చే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. రైతుల సంక్షేమం కోసం పనిచేస్తామని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

'మీ తప్పు వల్ల 700 మంది చనిపోతే.. సమాచారం లేదంటారా?'

'శాంటా అందరి కోరికలు వింటాడు.. మోదీ మాత్రం'

'కర్తార్​పుర్​ కారిడార్​తో దేశ ప్రజల కల నెరవేరింది'

Last Updated : Dec 26, 2021, 9:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.