ETV Bharat / bharat

Tributes to NTR: "మా గుండెలను మరొక్కసారి తాకిపో.." యుగపురుషుడికి ప్రముఖుల నివాళులు - chiranjeevi tribute to ntr

Famous Leaders Tributes to NTR: యుగపురుడు ఎన్టీఆర్‌ శత జయంతి వేళ.. పలువురు ప్రముఖులు ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని ట్విట్టర్​ వేదికగా గుర్తు చేసుకుంటున్నారు.

Tributes to NTR
Tributes to NTR
author img

By

Published : May 28, 2023, 1:07 PM IST

Tributes to NTR: విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. రాజకీయ, సినీ రంగాల్లో ఎన్టీఆర్‌ అద్భుతంగా రాణించారని మోదీ కొనియాడారు. బహుముఖ ప్రజ్ఞతో ఎన్టీఆర్‌ సినీ రంగంలో ఖ్యాతిగాంచారని మోదీ తెలిపారు. ఎన్టీఆర్‌ కోట్ల మంది హృదయాల్లో నిలిచిపోయారని పేర్కొన్నారు. ఎన్టీఆర్‌ 300కు పైగా చిత్రాల్లో నటించి అలరించారన్నారు. తన నటనతో అనేక పౌరాణిక పాత్రలకు జీవం పోశారని.. రాముడు, కృష్ణుడు పాత్రల్లో ఎన్టీఆర్‌ నటనను ఇప్పటికీ స్మరిస్తారని వెల్లడించారు. ఎన్టీఆర్‌ లక్షలాది ప్రజల మనసుల్లో స్థానం సంపాదించారని తెలిపారు. శత జయంతి వేళ ఎన్టీఆర్‌కు వినమ్రంగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నా అని మోదీ తెలిపారు.

తెలుగుజాతి ఘనకీర్తికి వన్నె తెచ్చిన ఘనుడు: "నూటికో కోటికో ఒక్కరు.. వందేళ్లు కాదు.. చిరకాలం, కలకాలం మన మనస్సులో మిగిలిపోతారు. చరిత్ర వారి గురించి భావితరాలకి గర్వంగా చెబుతుంది. అలాంటి కారణ జన్ముడు నందమూరి తారక రామారావు".. అని మెగాస్టార్​ చిరంజీవి అన్నారు. తెలుగు జాతి ఘనకీర్తికి వన్నె తెచ్చిన నందమూరి తారక రామారావు గారితో అనుబంధం తనకెప్పుడూ చిరస్మరణీయం అని తెలిపారు. రామారావు శత జయంతి సందర్భంగా వారిని స్మరించుకుంటున్నట్లు ట్విట్టర్​ వేదికగా తెలిపారు.

  • నూటికో కోటికో ఒక్కరు... వందేళ్లు కాదు...చిరకాలం, కలకాలం మన మనస్సులో మిగిలిపోతారు. చరిత్ర వారి గురించి భావితరాల కి గర్వంగా చెబుతుంది.
    అలాంటి కారణ జన్ముడు శ్రీ NTR.
    తెలుగు జాతి ఘనకీర్తి కి వన్నె తెచ్చిన శ్రీ నందమూరి తారక రామారావు గారితో నా అనుబంధం నాకెప్పుడూ చిరస్మరణీయం.…

    — Chiranjeevi Konidela (@KChiruTweets) May 28, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఆత్మగౌరవ నినాదంతో ఎన్నికల్లో నిలిచిన అజేయుడు: తెలుగువారి ఆత్మ గౌరవానికి ప్రతీక నందమూరి తారక రామారావు అని జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ కొనియాడారు. చరిత్ర మరువని నటనా కౌశలం.. తెలుగు నుడికారంపై మమకారం.. ఎన్టీఆర్‌ అని పేర్కొన్నారు. శత జయంతి వేళ ఆయనకు అంజలి ఘటించిన పవన్‌ కల్యాణ్‌.. పార్టీని స్థాపించిన 9 నెలల్లోనే అధికార కైవసం చేసుకున్నారని ప్రశంసించారు. దిల్లీ రాజకీయాల్లో గుర్తింపునకు నోచుకోక తెలుగు జాతి ఖ్యాతి మసకబారుతున్న తరుణంలో తెలుగువారి 'ఆత్మ గౌరవం' అనే నినాదంతో ఎన్నికల బరిలో నిలిచి అజేయమైన విజయం సాధించారన్నారు. రెండు రూపాయలకే కిలో బియ్యం వంటి పథకాలు ఎందరికో అనుసరణీయంగా మారాయని పేర్కొన్నారు. సినీ, రాజకీయ రంగాల్లో తనదైన ముద్ర వేసిన ఎన్టీఆర్‌.. తెలుగు బిడ్డగా జన్మించడం తెలుగువారందరికీ గర్వకారణమన్నారు.

మా గుండెలను మరొక్కసారి తాకిపో తాతా..: "మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది. మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది.పెద్దమనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా.. సదా మీ ప్రేమకు బానిసను" అంటూ జూనియర్​ ఎన్టీఆర్​ ట్వీట్​ చేశారు.

  • మా గుండెలను మరొక్కసారి తాకి పోండి తాతా 🙏🏻 pic.twitter.com/veKcoCWamx

    — Jr NTR (@tarak9999) May 28, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

వెండితెర ఇలవేల్పు నుంచి ఇంటింటి ఇలవెల్పుగా: దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మలుపు తిప్పి, విలువలతో కూడిన రాజకీయాలకు నిజమైన నిర్వచనాన్ని చెప్పి, ప్రత్యామ్నాయ రాజకీయాల మార్గదర్శకుడిగా, ప్రజాభ్యుదయమార్గ నవ్య పథగామిగా ఎన్టీఆర్ తనదైన ముద్ర వేశారని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ప్రవేశించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ప్రజా హృదయాలను గెలుచుకున్నారన్నారు. పాలనలో ఆయన తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు దేశంలోనే ఆదర్శంగా నిలిచాయని.. సమాఖ్య వ్యవస్థ కోసం పాటుపడిన ఎన్టీఆర్, దేశ రాజకీయాల్లో పెను మార్పులకు కేంద్రంగా నిలిచి మేటి నేతగా ఎదిగారన్నారు.

శ్రీ రాముడు, శ్రీ కృష్ణుడు తదితర పౌరాణిక పాత్రల్లో ఎన్టీఆర్ లీనమైన తీరు ఆయన్ను వెండి తెర ఇలవేల్పు నుంచి ఇంటింటి ఇలవేల్పుగా మార్చిందని కొనియాడారు. విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు, తెలుగు వారి గుండె చప్పుడు, మహోన్నత నాయకుడు దివంగత నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు. తన అసామాన్య నటన కౌశల్యంతో ఆయన ఏ పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేయగలరన్నారు.

  • విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు, తెలుగు వారి గుండె చప్పుడు, మహోన్నత నాయకుడు దివంగత శ్రీ నందమూరి తారక రామారావు గారి శత జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు. తన అసామాన్య నటన కౌశల్యంతో ఆయన ఏ పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేయగలరు. pic.twitter.com/ITP9bGMHG2

    — M Venkaiah Naidu (@MVenkaiahNaidu) May 28, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.