పంజాబ్‌లోని తరంతారణ్లో ముప్ఫై ఏళ్ల క్రిందట జరిగిన బూటకపు ఎన్‌కౌంటర్ కేసులో అసలు దోషులు పోలీసులేనని తేలింది. దీంతో ఇన్నేళ్ల తర్వాత ఓ కుటుంబానికి న్యాయం జరిగింది. అయితే ఈ కేసులో నిందితులైన మాజీ పోలీసు అధికారులు షంషేర్ సింగ్, జగ్తార్ సింగ్‌పై కేసు నమోదు చేశారు. దోషులకు సోమవారం శిక్ష ఖరారు చేయనున్నట్లు కోర్టు వెల్లడించింది.
పోలీసుల కథనం ప్రకారం.. 1993 ఏప్రిల్ 15న ఉబోక్లో నివాసముంటున్న హర్బన్స్ సింగ్ అనే వ్యక్తి నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకోవడానికి పోలీసులు వెళ్లారు. అదే సమయంలో ముగ్గురు ఉగ్రవాదులు పోలీసులపై దాడి చేయడం వల్ల వారు ఆత్మ రక్షణ కోసం ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో హర్బన్స్ సింగ్‌తో పాటు మరో గుర్తుతెలియని ఉగ్రవాది హతమయ్యాడు.
దీంతో ఉగ్రవాదులపై ఐపీసీ సెక్షన్ 302, 307, 34, అస్లా చట్టంలోని సెక్షన్ 5, టాడా చట్టం కింద అమృత్‌సర్‌లోని ఠానా సదర్‌లో కేసు నమోదు చేశారు. అయితే ఇదంతా అబద్దమని, అసలు దోషులు ఇద్దరు మాజీ పోలీసులే అని కోర్టు గుర్తించింది. దీంతో వీరిద్దరిపై ఐపీసీ సెక్షన్ 302, 120, 218 లతో కేసు నమోదు చేసి, పోలీసు కస్టడీకి పంపింది. వీరికి సోమవారం శిక్ష ఖరారు చేయనున్నట్లు కోర్టు వెల్లడించింది.
ఇదీ చదవండి: పట్టాలు తప్పిన గూడ్స్ రైలు లైవ్ వీడియో
ఆ సీఎంలు ఇస్తున్న డబ్బులతోనే PK రాజకీయం.. సంచలన విషయాలు వెల్లడి