ETV Bharat / bharat

ఫేక్ బస్టర్​ యాప్: వీడియోకాన్ఫరెన్స్‌లో చొరబడలేరు! - సైబర్​ నేరగాళ్లు

వీడియో కాన్ఫరెన్స్​ సమావేశాల్లో సైబర్​ నేరగాళ్లు చొరబడకుండా సరికొత్త డిటెక్టర్ సాఫ్ట్​వేర్​ను అభివృద్ధి చేశారు ఐఐటీ- రోపార్ పరిశోధకులు. మొహానికి మార్పులు చేసి, సామాజిక మాధ్యమాల్లో ఇతరులను కించపరిచేలా పెట్టే పోస్టులను కూడా ఇది ఇట్టే పట్టేస్తుందని పరిశోధకులు తెలిపారు.

fake buster app
ఫేక్ బస్టర్​ యాప్
author img

By

Published : May 20, 2021, 12:34 PM IST

మహమ్మారి వ్యాప్తి కారణంగా ఇప్పుడు ఉన్నతస్థాయి, కీలక సమావేశాలన్నీ వీడియో విధానంలోనే జరుగుతున్నాయి. ఇదే అదనుగా కొందరు సైబర్‌ మోసగాళ్లు ఈ సమావేశాల్లోకి రహస్యంగా చొరబడి, సమాచారాన్ని సేకరించడం పెద్ద బెడదగా మారింది. ఇలాంటి వారి ఆట కట్టించేందుకు పంజాబ్‌లోని ఐఐటీ-రోపర్, ఆస్ట్రేలియాలోని మోనాష్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ప్రత్యకంగా ఓ డిటెక్టర్‌ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేశారు. దీని పేరు 'ఫేక్‌బస్టర్‌'. మొహానికి మార్పులు చేసి, సామాజిక మాధ్యమాల్లో ఇతరులను కించపరిచేలా పెట్టే పోస్టులను కూడా ఇది ఇట్టే పట్టేస్తుందట!

"ముఖాలకు ముసుగు ధరించి ఇతరులెవరైనా వెబినార్, వర్చువల్‌ సమావేశాల్లో పాల్గొంటే, ఆ విషయాన్ని ఫేక్‌బస్టర్‌ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు. జూమ్, స్కైప్‌ అప్లికేషన్ల ద్వారా దీన్ని పరీక్షించాం. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ విధానాల్లో ఇది విజయవంతంగా పనిచేస్తోంది. నకిలీ ఆడియోలను కూడా గుర్తించేలా దీన్ని మరింత అభివృద్ధి చేస్తున్నాం. ప్రస్తుతానికి డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్‌లో మాత్రమే ఈ సాఫ్ట్‌వేర్‌ పనిచేస్తుంది. మొబైల్‌ ఫోన్లు, ఇతర చిన్న పరికరాల కోసం త్వరలోనే మరో అప్లికేషన్‌ను అందుబాటులోకి తెస్తాం".

-- రామనాథన్‌ సుబ్రమణియన్‌, ఐఐటీ-రోపర్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌

ఆన్‌లైన్‌ పరీక్షలు, ఇంటర్వ్యూల్లో ఇతరుల తరఫున హాజరయ్యే వారిని ఈ సాఫ్ట్‌వేర్‌లోని 'డీప్‌ఫేక్స్‌' టూల్‌ సాయంతో పట్టుకోవచ్చని మరో పరిశోధనకర్త అభినవ్‌ ధాల్‌ చెప్పారు.

ఇదీ చదవండి : టిక్ టాక్​ ఫౌండర్​ ఝాంగ్ సంచలన నిర్ణయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.