ETV Bharat / bharat

'లిక్కర్​ కిక్ ఇవ్వట్లే.. కల్తీ చేస్తున్నారు!'.. హోంమంత్రికి మందుబాబు ఫిర్యాదు - మధ్యప్రదేశ్​

Adulterated liquor in Ujjain: తాను కొనుగోలు చేసిన లిక్కర్​ కిక్కు ఇవ్వలేదని, కల్తీ జరిగిందంటూ రాష్ట్ర హోంమంత్రికి, అబ్కారీ శాఖకు ఫిర్యాదు చేశాడు ఓ మందుబాబు. వినియోగదారులు ఫోరమ్​కు వెళ్లనున్నట్లు తెలిపాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్​లోని ఉజ్జయిన్​లో జరిగింది.

adulterated liquor in Ujjain
మందుబాబు లోకేశ్​ సోథియా
author img

By

Published : May 8, 2022, 12:54 PM IST

Updated : May 8, 2022, 1:20 PM IST

Adulterated liquor in Ujjain: మద్యం కల్తీపై ఓ మందుబాబు ఏకంగా హోంమంత్రికే ఫిర్యాదు చేశాడు. తాను కొనుగోలు చేసిన లిక్కర్​ కిక్కు ఇవ్వలేదని, కల్తీ జరిగిందని తన ఆవేదనను ఫిర్యాదులో వెల్లబుచ్చాడు. కల్తీకి పాల్పడుతున్న దుకాణంపై చర్యలు తీసుకోండంటూ.. హోంమంత్రితో పాటు అబ్కారీ శాఖకు ఫిర్యాదు చేసిన ఈ సంఘటన మధ్యప్రదేశ్​లోని ఉజ్జయిన్​లో జరిగింది. ఫిర్యాదు అందుకున్న అబ్కారీ శాఖ కమిషనర్​.. దర్యాప్తు చేపట్టి చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.

adulterated liquor in Ujjain
హోంమంత్రి, అబ్కారీ కమిషనర్​కు ఫిర్యాదు చేసిన లోకేశ్​

ఇదీ జరిగింది: ఉజ్జయిన్​లోని బహదుర్​ గంజ్​కు చెందిన లోకేశ్​ సోథియా ఏప్రిల్​ 12న నగరంలోని ఓ మద్యం దుకాణంలో నాలుగు క్వార్టర్​ బాటిళ్లు కొనుగోలు చేశాడు. స్నేహితుడితో కలిసి రెండు సీసాలు ఖాళీ చేశాడు. బాటిల్​ మూత తీసినప్పుడు మద్యం వాసన రాకపోవటం, రెండు సీసాలు ఖాళీ అయినా కిక్కు ఎక్కకపోవటం వల్ల కల్తీ జరిగినట్లు భావించాడు. 'మరో రెండు బాటిళ్లను సీల్​ తీయకుండా నా వద్దే ఉంచుకున్నా. అవసరమైనప్పుడు ఆధారాలుగా వాటిని అందిస్తాను. ఆహారం, నూనెలు, ఇతర వస్తువుల్లో కల్తీ జరుగుతోందని వార్తలు వింటున్నాం. ఇప్పుడు లిక్కర్​లోనూ చేస్తున్నారు. అది చాలా ఆందోళన కలిగిస్తోంది. దీనిపై వినియోగదారుల ఫోరమ్​లో ఫిర్యాదు చేస్తాను. నేను రెండు దశాబ్దాలుగా మద్యం తాగుతున్నా.. దాని స్వచ్ఛత, రుచి నాకు తెలుసు.' అని పేర్కొన్నాడు సోథియా.

మధ్యప్రదేశ్​ హోంమంత్రి నరోత్తమ్​ మిశ్రా, ఉజ్జయిన్​ అబ్కారీ శాఖ కమిషనర్​ ఇందెర్​ సింగ్​ దమోర్​కు.. లిక్కర్​ కల్తీపై ఫిర్యాదు చేసినట్లు చెప్పాడు సోథియా. మరోవైపు.. వినియోగదారుల ఫోరమ్​లో చీటింగ్​ కేసు నమోదు చేస్తామని సోథియా న్యాయవాది నరేంద్ర సింగ్​ ధక్డే తెలిపారు. ' నా క్లయింట్​ పెయిడ్​ పార్కింగ్​ నడుపుతున్నారు. చాలా ఏళ్లుగా మద్యం సేవిస్తున్నారు. ఆయనకు ఏది నకిలీ, ఏది నిజమైనది అనే తేడా తెలుసు' అని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: కారులోని సోదరులపై తూటాల వర్షం.. నడిరోడ్డుపై అంతా చూస్తుండగానే..

పరీక్ష రాసి వస్తుండగా 12ఏళ్ల బాలిక కిడ్నాప్​.. రెండ్రోజుల పాటు గ్యాంగ్​ రేప్​

Last Updated : May 8, 2022, 1:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.