ETV Bharat / bharat

సీఏఏ నిబంధనల రూపకల్పనకు గడువు పెంపు

author img

By

Published : Mar 23, 2021, 5:15 PM IST

పౌరసత్వ సవరణ చట్టం నిబంధనల రూపకల్పనకు గడువు పెంచింది పార్లమెంటు. ఈ మేరకు కేంద్రమంత్రి నిత్యానంద రాయ్​ వెల్లడించారు.

Extension of deadline for preparation of CAA regulations
సీఏఏ నిబంధనల తయారీకి గడువు పెంపు

పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) నిబంధనల రూపకల్పన గడువును పార్లమెంటు పొడిగించింది. 2020 జనవరి 10న అమల్లోకి వచ్చిన సీఏఏ నిబంధనలు రూపొందించేందుకు ఏప్రిల్‌ 9 వరకు లోక్‌సభ, జులై 9 వరకు రాజ్యసభ గడువు ఇచ్చినట్లు కేంద్రమంత్రి నిత్యానంద రాయ్‌ లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు.

సాధారణంగా ఏదైన చట్టం అమల్లోకి వచ్చిన 6నెలల్లోపు నియమ నిబంధనలు రూపొందించాల్సి ఉంటుంది. కేంద్రం నియమ నిబంధనలు రూపొందించిన తర్వాత సీఏఏ పరిధిలోకి వచ్చే విదేశీయులు భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌ నుంచి వచ్చిన మైనార్టీలైన హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలు, క్రిస్టియన్లకు భారత పౌరసత్వం ఇచ్చేందుకు మోదీ సర్కార్‌ పౌరసత్వ సవరణ చట్టం తెచ్చింది.

ఇదీ చూడండి: 'సకాలంలో సీసీఏ- కాంగ్రెస్​ హామీ అవివేకం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.