శబరిమలలో పేలుడు పదార్థాలు కలకలం రేపాయి. అయ్యప్ప ఆలయ మార్గంలోని పెన్‌ఘాట్ వంతెన కింద ఆరు జిలెటిన్ స్టిక్స్‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
బాంబు స్క్వాడ్ సాయంతో సోదాలు చేపట్టారు. ఇదే మార్గంలో స్వామివారికి బంగారు ఆభరణాలను తీసుకొస్తారు.
ఈ నేపథ్యంలో తిరువాభరణం పాత్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ పీజీ శశికుమార వర్మ, జనరల్ సెక్రటరీ ప్రసాద్ కుజిక్కల ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టాలని సూచించారు.
ఇదీ చూడండి: అరుణాచల్ ప్రదేశ్ యువకుడ్ని అపహరించిన చైనా ఆర్మీ!