Himachal Pradesh 2022 Exit Polls: హిమాచల్‌ప్రదేశ్‌లో భాజపా, కాంగ్రెస్ నువ్వానేనా అన్నట్లు తలపడినట్లు కనిపిస్తోంది. కొన్ని సర్వేలు భాజపా అధికారం నిలబెట్టుకుంటుందని అంచనా వేయగా మరికొన్ని మాత్రం కాంగ్రెస్‌కు పట్టం కట్టాయి. పీపుల్స్ పల్స్ సర్వే ప్రకారం మొత్తం 68 స్థానాలకు భాజపా 27 నుంచి 37 చోట్ల, కాంగ్రెస్ 29 నుంచి 39 స్థానాల్లో విజయం సాధిస్తాయని వెల్లడైంది.
రిపబ్లిక్ టీవీ-పీ మార్క్యూ సర్వేలో భాజపాకు ఆధిక్యం లభించింది. భాజపా 34 నుంచి 39 చోట్ల విజయం సాధించవచ్చని తెలిపింది. కాంగ్రెస్ 28నుంచి 33చోట్ల, ఆప్ ఒకచోట గెలిచే అవకాశం ఉందని వెల్లడించింది. టైమ్స్‌నౌ-ఈటీజీ సర్వే కూడా భాజపాకు విజయం కట్టబెట్టింది. భాజపా 38చోట్ల, కాంగ్రెస్ 28చోట్ల విజయం సాధిస్తాయని అంచనా వేసింది.
ఆజ్‌తక్-యాక్సిస్ మై ఇండియా సర్వే కాంగ్రెస్‌కు మెజార్టీ కట్టబెట్టింది. ఆ పార్టీ 30 నుంచి 40 స్థానాలు గెల్చుకుంటుందని., భాజపా 24 నుంచి 34 చోట్ల విజయం సాధిస్తుందని పేర్కొంది. ఇండియా టీవీ సర్వే మాత్రం భాజపాకు మెజార్టీ కట్టబెట్టింది. కమలం పార్టీ 35 నుంచి 40 చోట్ల గెలుస్తుందని వెల్లడించింది. కాంగ్రెస్ పార్టీ 26 నుంచి 31 చోట్ల గెలవొచ్చని అంచనా వేసింది. న్యూస్‌ఎక్స్-జన్‌కీ బాత్ సర్వేలో భాజపాకు 32 నుంచి 40, కాంగ్రెస్‌కు 27 నుంచి 34 సీట్లు వచ్చాయి.
పీపుల్స్ పల్స్
- భాజపా 27-37
- కాంగ్రెస్ 29-39
- ఆప్ -
ఔట్ ఆఫ్ ద బాక్స్
- భాజపా 37-40
- కాంగ్రెస్ 22-28
- ఆప్ 5-7
ఆత్మసాక్షి
- భాజపా 31-35
- కాంగ్రెస్ 33-35
- ఆప్ 2-3
రిపబ్లిక్ టీవీ-పీ మార్క్యూ
- భాజపా 34-39
- కాంగ్రెస్ 28-33
- ఆప్ 0-1
టైమ్స్‌నౌ-ఈటీజీ
- భాజపా 38
- కాంగ్రెస్ 28
- ఆప్ 00
న్యూస్‌ఎక్స్
- భాజపా 32-40
- కాంగ్రెస్ 27-34
- ఆప్ 00
జన్‌కీ బాత్
- భాజపా 32-40
- కాంగ్రెస్ 27-34
- ఆప్ 1-2
జీన్యూస్
- భాజపా 35-40
- కాంగ్రెస్ 20-25
- ఆప్ 0-3
ఇండియా టీవీ
- భాజపా 35-40
- కాంగ్రెస్ 26-31
- ఆప్ 0
జీన్యూస్
- భాజపా 35-40
- కాంగ్రెస్ 20-25
- ఆప్ 0-3
ఇండియా టీవీ
- భాజపా 35-40
- కాంగ్రెస్ 26-31
- ఆప్ 0
ఆజ్‌తక్-యాక్సిస్ మై ఇండియా
- భాజపా 24-34
- కాంగ్రెస్ 30-40
- ఆప్ 0