ETV Bharat / bharat

'డీఎంకే అధికారంలోకి వస్తే రౌడీయిజం పెరుగుతుంది'

తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే విజయం సాధిస్తే రాష్ట్రంలో రౌడీయిజం, అక్రమాలు పెరిగిపోతాయన్నారు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, భాజపా నేత కిషన్​ రెడ్డి. ఎన్నికల్లో భాజపా పాత్ర సహా.. పలు అంశాలపై ఈటీవీ భారత్​తో ప్రత్యేకంగా ముచ్చటించారు.

Exclusive: DMK is neither anti-Hindi nor anti national, says Kishan Reddy
'డీఎంకే హిందీ, దేశ వ్యతిరేక పార్టీ కాదు'
author img

By

Published : Apr 2, 2021, 8:15 PM IST

తమిళనాడులో తమ ప్రత్యర్థి డీఎంకేను.. హిందూ వ్యతిరేక లేక దేశ వ్యతిరేక పార్టీగానో పరిగణించట్లేదని భాజపా నేత, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. అలా ఆలోచించడం తప్పని, అది తమ పార్టీ భావన ఎంతమాత్రం కాదని పేర్కొన్నారు. ఇటీవల తమ పార్టీ నేతలు డీఎంకేపై పలు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయన పైవిధంగా స్పందించారు. అయితే.. రాష్ట్రంలో డీఎంకే అధికారంలోకి వస్తే రౌడీయిజం, అక్రమాలు పెరిగిపోతాయన్నారు. ఈ మేరకు ఈటీవీ భారత్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై చెప్పుకొచ్చారు.

హోం మంత్రి జీ.కిషన్​ రెడ్డితో ఈటీవీ భారత్ బ్యూరో చీఫ్ ఎం.సి.రాజన్‌ ప్రత్యేక ఇంటర్వ్యూ

ఉనికి కోసం..

జాతీయ పార్టీలు ప్రాంతీయంగా ఉనికిని చాటుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయని కిషన్​రెడ్డి అభిప్రాయపడ్డారు. ఏఐఏడీఎంకేతో కలసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పటికీ.. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాల్సిన అవసరం ఉందన్నారు.

ఎన్డీఏ కోసమే..

ప్రతి పార్టీ అధికారంలోకి రావాలనుకుంటుందని.. భాజపా అందుకు మినహాయింపు ఏమీ కాదని కిషన్​ రెడ్డి స్పష్టం చేశారు. అయితే రాష్ట్రంలో పార్టీ సంస్థాగతంగా బలహీనంగా ఉందని తెలిపారు. ఎన్డీఏ కూటమిని కాపాడుకునేందుకే 20 స్థానాల్లో పోటీ చేయడానికి భాజపా అంగీకరించిందన్నారు. ఒంటరిగా పోటీ చేయడమే దీర్ఘకాలంలో తమ పార్టీకి మంచిదని అభిప్రాయపడ్డారు.

లంక తమిళులపై..

శ్రీలంకలో యుద్ధ నేరాల జవాబుదారీతనంపై యూఎన్​హెచ్ఆర్​సీ ప్రవేశపెట్టిన తీర్మానంపై ఓటింగ్​కు దూరంగా ఉండాలనే భారత్ నిర్ణయంపైనా ఆయన స్పందించారు. లంకలోని తమిళుల హక్కులను పరిరక్షేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

ఇవీ చదవండి: ద్రవిడ రాజకీయాన్ని మార్చే పోరుకు సర్వం సిద్ధం

స్టాలిన్​ను దాటి అన్నాడీఎంకే హ్యాట్రిక్​ కొట్టేనా?

'తమిళవాదం'పై డీఎంకే, అన్నాడీఎంకే ఏకస్వరం

డీఎంకే వారసత్వ, ప్రజాస్వామ్య వ్యతిరేక పార్టీ: భాజపా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.