ETV Bharat / bharat

పెళ్లి కాని రాహుల్​తో జరభద్రం: మాజీ ఎంపీ

కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీపై కేరళ మాజీ ఎంపీ జోస్​ జార్జ్​ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాహుల్​ గాంధీకి పెళ్లికాలేదని, ఆయనకు అమ్మాయిలు దూరంగా ఉండాలని అన్నారు.

Kerala, former MP Joyce George
కేరళ మాజీ ఎంపీ, వామపక్షమద్దతుదారు జోస్​ జార్జ్​
author img

By

Published : Mar 30, 2021, 2:19 PM IST

కేరళ మాజీ ఎంపీ జోస్​ జార్జ్​.. రాహుల్​ గాంధీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్​ మాజీ అధ్యక్షుడు రాహుల్​గాంధీకి పెళ్లికాలేదని, ఆయన పట్ల అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.

కేరళ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల రాహుల్​ గాంధీ కొచ్చిలోని మహిళల కళాశాలను సందర్శించి, విద్యార్థినులకు మార్షల్​ ఆర్ట్స్​ శిక్షణ ఇవ్వడాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు జార్జ్. వామపక్ష అభ్యర్థి, మంత్రి ఎమ్​ఎమ్​ మణి తరఫున కేరళలోని ఇడుక్కై ఎన్నికల ప్రచారంలో జార్జ్​ చేసిన ఈ వ్యాఖ్యలపై పెద్ద దుమారం రేగింది.

కాంగ్రెస్​ పార్టీ సదరు వ్యాఖ్యల్ని ఖండించింది. ఆయనను అరెస్టు చేయాలని డిమాండ్​ చేసింది. రాహుల్​ గాంధీపై వ్యక్తిగత దూషణలు చేయడం తగదని సీపీఎం నేత, సీఎం పినరయి విజయన్​ అన్నారు. రాహుల్​ గాంధీ రాజకీయంగానే తమకు విరోధి అని, వ్యక్తిగతంగా కాదని స్పష్టం చేశారు. మహిళల్ని కించపరిచే వ్యాఖ్యలేవీ జార్జ్​ చేయలేదని, రాహుల్​ను మాత్రమే విమర్శించారని మంత్రి ఎమ్ఎమ్​ మణి అన్నారు.

2014 లోక్​సభ ఎన్నికల్లో వామపక్ష కూటమి మద్దతుతో స్వతంత్ర అభ్యర్థైన జోస్​ జార్జ్​ గెలిచారు.

ఇదీ చదవండి: విద్యార్థులతో స్టెప్పులేసి అదరగొట్టిన రాహుల్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.