Gutti Vankaya Curry Recipe in Telugu : చాలా మంది ఎక్కువగా ఇష్టపడే రెసిపీలలో ఒకటి.. గుత్తొంకాయ. అయితే, ఎక్కువ మంది దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కాస్త శ్రమతో కూడుకున్న పనిగా, టైమ్ ఎక్కువ పడుతుందని భావిస్తారు. కానీ, మీకు తెలుసా? ఎవరైనా సరే ఈ పద్ధతిలో నిమిషాల్లో సూపర్ టేస్టీగా గుత్తొంకాయ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా అద్దిరిపోతుంది! మరి, ఇంకెందుకు ఆలస్యం అందుకు కావాల్సిన పదార్థాలేంటి? ఎలా తయారు చేసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు :
- గుండ్రటి వంకాయలు - అరకేజీ
- ఆయిల్ - తగినంత
- ఆవాలు - అరటీస్పూన్
- జీలకర్ర - అరటీస్పూన్
- పచ్చిమిర్చి - 3
- కరివేపాకు - కొద్దిగా
స్టఫింగ్ కోసం :
- పల్లీలు - 2 టేబుల్‌స్పూన్లు
- మినప్పప్పు - 1 టేబుల్‌స్పూన్
- శనగపప్పు - 1 టేబుల్‌స్పూన్
- ధనియాలు - 1 టేబుల్‌స్పూన్
- మెంతులు - చిటికెడు
- జీలకర్ర - అరటీస్పూన్
- ఎండుకొబ్బరి పొడి - 1 టేబుల్‌స్పూన్
- తెల్ల నువ్వులు - 1 టేబుల్‌స్పూన్
- చింతపండు - కొద్దిగా
- కారం - 3 టీస్పూన్లు
- ఉప్పు - 1 టీస్పూన్
- పసుపు - అరటీస్పూన్
- అల్లంవెల్లుల్లి పేస్ట్ - 2 టీస్పూన్లు
- ఉల్లిపాయలు - 2(మీడియం సైజ్‌వి)
- టమాటా - 1
లఖ్‌నవూ స్పెషల్ "మలై గుత్తొంకాయ కుర్మా" - ఒక్కసారి టేస్ట్ చేశారంటే జిందగీ ఖుష్ అయిపోతుంది!
తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా గుండ్రటి వంకాయలను శుభ్రంగా కడిగి తొడిమె ఉండేలా కింది వైపు నుంచి నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలి. ఆపై వాటిని ఒక బౌల్లో కొద్దిగా ఉప్పు వేసుకున్న వాటర్‌లో వేసి పక్కన ఉంచుకోవాలి.
- అలాగే రెసిపీలోకి కావాల్సిన ఉల్లిపాయలు, టమాటాను సన్నగా తరుక్కొని పక్కన ఉంచుకోవాలి.
- అనంతరం స్టఫింగ్‌ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసం స్టౌపై చిన్న కడాయి పెట్టుకొని పల్లీలు, మినప్పప్పు, శనగపప్పును వేసుకొని దోరగా వేయించుకోవాలి.
- ఆ తర్వాత అందులో ధనియాలు, మెంతులు, జీలకర్ర వేసుకొని లో ఫ్లేమ్ మీద అన్నింటినీ మాడకుండా మరికాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇక చివరగా ఎండుకొబ్బరి పొడి, తెల్ల నువ్వులు కూడా యాడ్ చేసుకొని అన్నింటినీ చక్కగా వేయించుకోవాలి.
- అనంతరం మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించుకున్న పల్లీల మిశ్రమం, చింతపండు, కారం వేసుకొని మెత్తని పొడిలా కాకుండా కాస్త బరకగా మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలి.
- ఆ తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని తీసుకొని పసుపు, ఉప్పు, అల్లంవెల్లుల్లి పేస్ట్, సన్నని ఆనియన్, టమాటా తరుగు యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి.
ఎప్పుడైనా వంకాయ బజ్జీ కర్రీ తిన్నారా?- రాయలసీమ స్టైల్లో తిన్నారంటే వావ్ అనాల్సిందే!
- ఇప్పుడు ముందుగా కట్ చేసుకుని వాటర్‌లో వేసుకున్న వంకాయలను తీసుకొని వాటిల్లో మీరు ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని చక్కగా స్టఫ్ చేసుకోవాలి. అన్నింటినీ స్టఫ్ చేసుకున్నాక కొంత మిశ్రమం మిగులుతుంది. దాన్ని పక్కన ఉంచుకోవాలి.
- అనంతరం స్టౌపై కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె కాస్త వేడయ్యాక జీలకర్ర, ఆవాలు వేసుకొని చిటపటలాడనివ్వాలి. ఆపై పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి.
- అవి చక్కగా వేగాయనుకున్నాక మీరు ముందుగా స్టఫ్ చేసుకున్న వంకాయలను ఒక్కొక్కొటిగా వేసుకొని మధ్యమధ్యలో కలుపుతూ రెండు నుంచి మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి.
- ఆవిధంగా వేయించుకున్నాక మిగిలిన స్టఫింగ్ కర్రీలో యాడ్ చేసుకొని లో ఫ్లేమ్ మీద జాగ్రత్తగా కలుపుతూ మరో రెండు నుంచి మూడు నిమిషాలు మగ్గనివ్వాలి.
- ఆ తర్వాత అందులో ఒక గ్లాసు వాటర్ పోసుకుని ముక్కలు చిదమకుండా జాగ్రత్తగా మిశ్రమం మొత్తం కలిసేలా కలుపుకొని ఉప్పు సరిచూసుకోవాలి. ఆపై మూతపెట్టుకొని లో ఫ్లేమ్ మీద ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి.
- అలా ఉడికించుకున్నాక ప్రెజర్ మొత్తం పోయాక మూత తీసి కొత్తిమీర తరుగు వేసుకొని నెమ్మదిగా కలిపి సర్వ్ చేసుకుంటే చాలు. అంతే.. ఎంతో రుచికరంగా ఉండే "గుత్తొంకాయ కర్రీ" రెడీ!
గుత్తి వంకాయతో ఘుమఘమలాడే దమ్ బిర్యానీ - ఒక్కసారైనా తిని తీరాల్సిందే గురూ! - ఇలా ప్రిపేర్ చేయండి