ETV Bharat / state

అదానీకి షాక్​ - రూ.100 కోట్ల విరాళాన్ని తిరస్కరించిన రాష్ట్ర ప్రభుత్వం

విమర్శల దృష్ట్యా స్కిల్‌ వర్శిటీకి అదానీ విరాళాన్నితిరస్కరించాం - రూ.100 కోట్లు స్కిల్‌ వర్శిటీకి బదిలీ చేయవద్దని అదానీకి లేఖ

Telangana government rejects Rs 100 crore Adani donation
Telangana government rejects Rs 100 crore Adani donation (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 25, 2024, 3:59 PM IST

Updated : Nov 25, 2024, 5:48 PM IST

Telangana government rejects Rs 100 crore Adani donation : అదానీ గ్రూప్‌పై లంచాల విమర్శల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ సర్కారు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన యంగ్‌ ఇండియా స్కిల్ వర్సిటీకి ఇటీవల అదానీ గ్రూప్‌ ప్రకటించిన రూ.100 కోట్ల విరాళాన్ని స్వీకరించరాదని ఈ మేరకు నిర్ణయించింది. ఈ మేరకు సీఎం రేవంత్‌ రెడ్డి ప్రెస్​మీట్​లో వెల్లడించారు. ఆ గ్రూప్‌పై విమర్శల నేపథ్యంలో అదానీ ఫౌండేషన్‌ నుంచి విరాళాన్ని తీసుకోవడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు ఆ అదానీ గ్రూపునకు లెటర్​ను పంపినట్లుగా సీఎం వెల్లడించారు.

Telangana government rejects Rs 100 crore Adani donation
రూ.100 కోట్లు స్కిల్‌ వర్శిటీకి బదిలీ చేయవద్దని అదానీకి లేఖ (ETV Bharat)

అనవసర వివాదాల్లోకి ప్రభుత్వాన్ని లాగొద్దు : 'అదానీ విషయంలో గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. అదానీ నుంచి తెలంగాణ ప్రభుత్వం నిధులను స్వీకరించిందని కొందరు విమర్శిస్తున్నారు. రాజ్యాంగ బద్ధంగా, చట్టబద్ధంగానే అదానీ నుంచి పెట్టుబడులను అనుమతిస్తాం. నియమ నిబంధనల మేరకే టెండర్లు పిలిచి ప్రాజెక్టులు ఇస్తున్నాం. దేశంలో ఏ సంస్థలకైనా చట్టబద్ధంగా బిజినెస్​ చేసుకొనే హక్కు ఉంటుంది. అంబానీ, అదానీ, టాటా ఎవరికైనా తెలంగాణ రాష్ట్రంలో వ్యాపారం చేసుకొనే హక్కు ఉంది' అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

గొప్ప సంకల్పంతో లక్షలాది మంది నిరుద్యోగులకు టెక్నికల్​ స్కిల్స్​ నేర్పించే లక్ష్యంతో యంగ్​ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గొప్ప సదుద్దేశంతో ప్రారంభించిన ఈ స్కిల్​ వర్సిటీ వివాదాలకు లోను కావడం మంత్రివర్గ సహచరులకు, నాకు(సీఎం రేవంత్), ప్రభుత్వానికి ఇష్టంలేదని వివరించారు. అదానీ గ్రూప్‌ స్కిల్స్‌ వర్సిటీకి ఇచ్చిన విరాళాన్ని సీఎం, మంత్రులకు ఇచ్చినట్లుగా కొందరు ప్రచారం చేస్తున్నారన్నారు. సీఎస్‌ఆర్‌(కార్పొరేట్ సామాజిక బాధ్యత) కింద స్కిల్స్‌ వర్సిటీకి అదానీ గ్రూప్‌ ప్రకటించినటువంటి రూ.100 కోట్లు బదిలీ చేయొద్దని కోరుతూ ఆ గ్రూప్‌నకు లేఖ పంపామని పేర్కొన్నారు. అనవసర వివాదాల్లోకి రాష్ట్ర ప్రభుత్వాన్ని లాగొద్దని కోరారు. తెలంగాణ ప్రభుత్వ అకౌంట్​లోకి ఎవరి నుంచీ డబ్బులు రాలేదని రేవంత్ రెడ్డి అన్నారు.

అవసరమైతే దిల్లీకి ఎన్నిసార్లైనా వెళ్తాం : 'నేటి దిల్లీ పర్యటనకు పాలిటిక్స్​తో సంబంధంలేదు. లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా కుమార్తె వివాహం కోసమే దిల్లీ టూర్​కు వెళ్తున్నాం. పార్లమెంటు సమావేశాలపై ఎంపీలతో మంగళవారం చర్చిస్తాము. అందుబాటులో ఉన్న కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర సమస్యల్ని వివరిస్తాము. 28 సార్లు దిల్లీ పర్యటనకు వెళ్లానని కొందరు విమర్శిస్తున్నారు. నేను వారిలా పైరవీలు చేయడానికో, బెయిల్‌ కోసమో దిల్లీకి వెళ్లలేదు. కేంద్రం నుంచి మనకు(రాష్ట్రానికి) రావాల్సినవి రాబట్టుకోవాలి. అవసరమైతే దిల్లీకి ఎన్నిసార్లయినా వెళ్తాం' అని సీఎం రేవంత్ రెడ్డి’ అన్నారు.

జైలుకెళ్లాలని కేటీఆర్‌ తహతహలాడుతున్నారు : 'బీఆర్‌ఎస్‌ ప్రభుత్వహయాంలో అదానీకి గతంలో ఎన్నో ప్రాజెక్టులు ఇచ్చింది. అదానీతో కేసీఆర్​ సర్కారు అంటకాగింది. అదానీ వద్ద వాళ్లు కమీషన్లను తిన్నారు. కేటీఆర్‌(బీఆర్ఎస్​) జైలుకు వెళ్లాలని తహతహలాడుతున్నారు. జైలుకెళ్తే ముఖ్యమంత్రి అవ్వొచ్చని అనుకొంటున్నారు. కేసీఆర్‌ ఫ్యామిలీలో నుంచి ఇప్పటికే కవిత జైలుకు వెళ్లారు. జైలుకెళ్లినవారు ముఖ్యమంత్రి అయ్యేదుంటే ముందు కవిత అవుతారు. కేసీఆర్‌ ఫ్యామిలీలో సీఎం సీటు కోసం పోటీ ఎక్కువగా ఉంది’’ అని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు.

నైపుణ్యాభివృద్ధి దిశగా స్కిల్ యూనివర్సిటీ - తెలంగాణ మిషన్ పూర్తి లక్ష్యాలేంటి? - Prathidhwani on Skill University

దేశానికే రోల్​మోడల్​గా స్కిల్ యూనివర్సిటీ - 150 ఎకరాల స్థలం రూ.100 కోట్లు కేటాయింపు : సీఎం - CM Revanth On Skill University

Last Updated : Nov 25, 2024, 5:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.