బిహార్లోని కతిహార్ పట్టణంలో దారుణం జరిగింది. నగర మాజీ మేయర్ శివరాజ్ పాసవాన్ (45)ను గుర్తుతెలియని వ్యక్తులు దారుణ హత్య చేశారు. ద్విచక్రవాహనాలపై వచ్చిన దుండగులు.. శివరాజ్పై కాల్పులు జరిపి పరారయ్యారు. ఈ ఘటన గురువారం జరిగింది.
తీవ్ర గాయాలు పాలైన పాసవాన్ను అధికారులు స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే పరిస్థితి విషమించడం వల్ల పాసవాన్ మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ హత్య గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఈ ఏడాది మార్చిలో తాత్కాలిక నగర మేయర్గా ఎన్నికైన పాసవాన్.. జూన్ వరకు బాధ్యతలు చేపట్టారు.
ఇదీ చదవండి : కోతులకు విషం పెట్టి.. గోనెసంచుల్లో కుక్కి!