ETV Bharat / bharat

కరోనాతో మాజీ సీఎం భార్య మృతి - కరోనా నిబంధనలు

హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, భాజపా సీనియర్ నాయకుడు శాంత కుమార్ సతీమణి సంతోష్ షెల్జా మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. కొద్ది రోజుల క్రితమే కరోనా బారినపడిన ఆమె వయస్సు 83 సంవత్సరాలు.

Ex-Himachal CM's wife dies after testing Covid positive
కరోనాతో హిమాచల్ మాజీ సీఎం సతీమణి మృతి
author img

By

Published : Dec 29, 2020, 2:04 PM IST

హిమాచల్​ ప్రదేశ్​ మాజీ ముఖ్యమంత్రి శాంత కుమార్​ సతీమణి సంతోష్ షెల్జా గుండెపోటుతో మరణించారు. గతంలో కరోనా నుంచి కోలుకున్న ఆమెకు మరోసారి వైరస్ సోకగా డిసెంబర్​ 27న ఆసుపత్రిలో చేరారు. శాంతకుమార్ సైతం ఇదే ఆసుపత్రిలో కొవిడ్ చికిత్స పొందుతున్నారు.

కాంగ్రా జిల్లాలోని టండా మెడికల్​ కాలేజీలో చికిత్స పొందుతున్న షెల్జాకు మంగళవారం తెల్లవారుజామున గుండెపోటు వచ్చిందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

రెండు రోజుల క్రితమే ప్రధాని నరేంద్ర మోదీ హిమాచల్​ ప్రదేశ్​ సీఎంకు ఫోన్​ చేసి ఆరోగ్యంపై ఆరాతీశారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఇదీ చదవండి: 'ఆత్మనిర్భర్​ భారత్​కు సరకు రవాణా కీలకం'

మరో కేంద్ర మంత్రికి కరోనా..

కేంద్ర ఆరోగ్య మంత్రి అశ్వినీ కుమార్​ చౌబేకు కరోనా పాజిటివ్​గా తేలింది.

స్వల్ప లక్షణాలు కనిపించగా కరోనా పరీక్ష చేయించుకున్నా. ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంగా ఉన్నా. ఇంట్లోనే స్వీయ ఏకాంతంలో గడుపుతున్నా. ఈ మధ్య నన్ను కలిసిన వారందరూ పరీక్షలు చేయించుకోండి.

-చౌబే ట్వీట్

ఇదీ చదవండి: రాజకీయరంగ ప్రవేశంపై వెనక్కి తగ్గిన రజనీకాంత్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.